బాలయ్యకు మతి చెడిందా

25 Feb 2016                 అధికారం తలకెక్కితే ఏం చేసినా చెల్లుతుందనేవారు కొంతమంది ఉంటారు. ఇప్పుడా కోవలోకి ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ కూడా  జాయినైపోయారనే అనుకోవాలి. ఎందుకంటే వైఎస్సార్సీపీ నుంచి టిడిపిలోకి మారిన ఎమ్మెల్యేల సంగతి చూస్తే, వారంత డెవలప్ మెంట్ చూసే తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు బాలయ్య. రాజీనామా చేయించి తీసుకోవచ్చుగా అని అడిగితే అవును, వాళ్లంతా రాజీనామా చేస్తారని చెప్పాడాయన.

                    అంతవరకూ బాగానే ఉఁది, ఇంతలోనే పక్కనున్న ఓ సత్రకాయ్ చెవిలో ఏదో చెప్పగానే. అసలెందుకు రాజీనామాలు చేయాలని ఎదురు ప్రశ్న సంధించాడు. దీంతో  అంతకు ముందు ఆ ప్రశ్న అడిగినవారితో పాటు, మిగిలినవాళ్లూ కూడా బిత్తరపోయారు. అర్ధం పర్ధం లేకుండా పెద్దగాపెద్దగా నవ్వడం అంతలోనే సర్దుకోవడంతో అసలేమైంది ఈయనకు అన్పించింది. దానికి తోడు లేపాక్షి  ఉత్సవాలంటూ కొత్తగా హడావుడి మొదలుపెట్టిన బాలయ్య వాటికి ఎవరినైనా పిలుస్తా, నా ఇష్టం వచ్చినోళ్లనే పిలుస్తా..అడగడానికి నువ్వెవరనే పద్దతిలో రెచ్చిపోయాడు. చిరంజీవిని నేనెందుకు పిలవాలని అడిగిన బాలయ్య నా నెత్తినెక్కి తొక్కేవాళ్లను పిలవను అని ఏదో పెద్ద ఘనత సాధించినవాడిలా నవ్వేయడం మొదలెట్టాడు. 
                    పక్కనున్న ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వెకిలిగా జత కలిశాడు. అసలు చిరంజీవిని పిలవను అనడానికి పిచ్చి వ్యాఖ్యానాలు చేయడానికి ఏమైనా సంబంధం ఉందా. అసలు చిరంజీవి ఫీల్డ్ లో ఉన్నంత కాలం అతనే నంబర్ వన్ అలాంటి హీరోని పిలవను అని చెప్పాల్సిన అవసరం ఏంటి, అక్కడికి లేపాక్షి ఉత్సవాలనేవి రాష్ట్రస్థాయి కార్యక్రమాలేం కాదు. ఓ వేళ అదే స్థాయి అయితే, దానికి కళాకారులని పిలిచే మనసులేన దౌర్భాగ్య స్థితిలో అవి జరుగుతున్నాయనే అనుకోవాలి. 
అందుకే బాలయ్యకు డిక్టేటర్ సినిమా తన్నేయడంతో మైండ్ బ్లాంకై ఏదేదో మాట్లాడేస్తున్నాడని జనం నవ్వుకుంటున్నారు .నిజానికి ఓ ఫంక్షన్లో గానీ, ప్రెస్ మీట్లోగానీ ఇంతవరకూ మాట్లాడటం  చేతగాలేదు అని  ఎవర్నైనా అంటారంటే అది బాలయ్యకే వర్తిస్తుంది. తనకి తానే శ్రీకృష్ణదేవరాయలను అనుకోవడం, గొలుసు కట్టు మాటలను తప్పులతడకగా  ఉఛ్చరించడం ఆయనకే సాద్యం. అలాంటి బాలయ్య ఇతర నటులను గౌరవించకపోవడం శోచనీయం అని ప్రేక్షకులు వాపోతున్నారు.
Hindupuram MLA Bhalakrishna mind was upset with dictator movie flap. He comment about four of YSRCP MLAs who jumped into TDP is very funny.