కప్పలతక్కెడ

19 Feb 2016


                      వైఎస్సార్సీపీ నుంచి భూమా నాగిరెడ్డి జంప్ అవుతున్నారంటూ ఇవాళ మీడియాలో తెగ హడావుడి నడిచింది ఐతే ఆయన మాత్రం ఆ వార్తలను ఖండించారు. అంతటితో ఊరుకోకుండా కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని కదిలించేసరికి ఎబిఎన్ కు గూబ గుయ్ మన్నంత పనైంది. ఆయన సంగతి నీకెందుకు నా సంగతి చెప్తున్నా నేను పార్టీ మారడం లేదంటూ స్ట్రాంగ్ డోసిచ్చారు. దీంతో మైండ్ గేమ్ టిడిపిదే అని అర్ధమవుతోంది. ఎందుకంటే అధికారం కోసం ఎవరెప్పుడు ఏ పార్టీ మారతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలాంటప్పుడు వాళ్లు మారుతున్నారు, వీళ్లు మారుతున్నారని మీడియాలో లీకులివ్వడం అంత సరైనది కాదు. జంప్ జిలానీల గురించే ముందు తెలుసుకున్నంత మాత్రాన ఎవరికి ఎం ప్రయోజనం ఒరుగుతుందో ఎవరికి ఎరుక. 

                     ఐతే కప్పలతక్కెడగా మారిన రాజకీయాల్లో ఫలానావారు మాత్రమే అవతలి పార్టీలోకి చేరుతున్నారని చెప్పడం అవివేకమే అవుతుంది. రాజకీయాలు మరీ వ్యక్తిగతంగా మారిపోయిన తర్వాత టిఆర్ఎస్ లోకి చేరిన టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా పెరిగిపోయినదీ అంతా చూస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టేనాటికి టిఆర్ఎస్ సభ్యులు 63 మంది, కానీ ఇప్పుడు చూస్తే 81మందికి చేరారంటే ఈ ప్రస్థానం ఎటు దారి తీస్తుందో అర్ధం అవుతూనే ఉంది. అధికారం బెదిరింపు రాజకీయాలు ఈ రెండు కలగలిసినన్నాళ్లూ జంప్ జిలానీలకు కొదవ ఉండదు.
Today yellow media new channels telecast a news about YCP Bhuma Nagi Reddy changing party to TDP. MLAs are frequently changing party, Now MLA in TRS are 81, at the time of government formation no of seats are 63.