పోతే పోనీ

25 Feb 2016                          జంప్ జిలానీలపై వైఎస్ జగన్ స్పందిస్తున్నతీరిది, చంద్రబాబు పాలన ఘోరంగా ఉందన్న వైఎస్ జగన్ అందుకు నిదర్శనమే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చెప్తున్నారు. తమ పాలన అంత అద్భుతంగా ఉంటే ఎందుకు విపక్ష ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారాయన. కడపలో టూర్ చేస్తున్న జగన్, అసలు పార్టీలో మొదట తాను, వైఎస్ విజయమ్మ మాత్రమే ఉన్నామని, ఆ తర్వాత 14మంది ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి గెలిచారని గుర్తు  చేశారు. ఇప్పుడు 67కు చేరిన తమ బలం నలుగురైదుగురు పోయినంత మాత్రం నష్టమేం లేదన్నారు. టిడిపి తమ పాలనపై అపనమ్మకంతోనే ఇలా సంతబేరాలు చేస్తుందన్న జగన్. తమ అవినీతి సంపాదనతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 20కోట్లు టిడిపి ఆఫర్ చేస్తుందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు జగన్, ఓ వేళ అదే నిజమైతే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు.
  


                     అసలు చంద్రబాబునాయుడికి ఎప్పుడూ దొడ్డిదారినే అధికారంలోకి రావడం అలవాటని గుర్తు చేశారు జగన్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తమ వెంట ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారాయన. ఇప్పుడు వెళ్తున్న ఎమ్మెల్యేలు ఏడాదైతే తిరిగి రాకతప్పదని జోస్యం చెప్పిన జగన్. అప్పుడు తాము మాత్రం వాళ్లని చేర్చుకోమని. రాజీనామాలు చేయించి పార్టీలోకి తీసుకుంటామని సవాల్ విసిరారు. ఐనా జగన్ పిచ్చికానీ, అధికారపార్టీ నుంచి ప్రతిపక్షానికి రావడానికి ఎమ్మెల్యేలు ఎందుకు ముందుకు వస్తారు. ఆ పరిస్థితే ఉంటే ఇప్పుడెందుకు వెళ్తారు. స్వలాభం నెరవేర్చుకోవడానికే పార్టీల జెండాలు మార్చే ఈ నేతలు అది నెరవేర్చుకోకుండా అంత త్వరగా తిరుగుముఖం పట్టరు.
Recently some of YSRCP MLAs were joined in TDP, about this YS Jagan responded and told let them go it wont damage party image.