ఈయనకు యూరిన్ డెట్టాల్ ఒకటేనట

2 Feb 2016


                   లాలూ ప్రసాద్ యాదవ్ అంటే మన తెలుగుసినిమాల్లో నాగభూషణం విలనీ తెలిసినోళ్లకు పెద్దగా పరిచయం చెయ్యక్కర్లేదు, వింతవేషాలు ప్రవర్తనతో తనకో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు లాలూ. గడ్డితిన్న స్కామ్ లో జైల్లో ఊచలు లెక్కెట్టేసిన లాలూ. ఆ తర్వాత డైరక్ట్ ఎలక్షన్స్ కి దూరమయ్యాడు. కొడుకులను పాలిటిక్స్ కి ఎంట్రీ చేయించి హిట్ కొట్టించాడు కూడా, ఆ సక్సెస్ ఇచ్చిన ఊపులో రెచ్చిపోతున్న లాలూ డెట్టాల్, యూరిన్ రెండూ  ఒకటేనంటూ ప్రవచిస్తున్నారు. పాట్నా హోమియోపతిక్ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొన్న లాలూ సైంటిఫిక్ డెవలప్ మెంట్ ఏదైనా ఉఁదంటే అది డెట్టాల్ తో చేతులు కడుక్కోవడం అని. అసలు అంతకుముందు యూరిన్ తో గాయాలకు చికిత్స చేశేవాళ్లంటూ చరిత్ర తిరగేశారు. ఇది నిజమో కాదో కానీ అంతకుముందు మొరార్జీ దేశాయ్ కూడా శరీరంలో లవణాలు పోకుండా ఉండాలంటే ఎవరి మూత్రం వారే తాగాలంటూ 1977లో సెలవిచ్చారు. 
                         సైన్స్ ప్రకారం వాళ్లు చెప్తున్నామంటారు కానీ, నిజానికి యూరిక్ ఆసిడ్ ఒక్కసారి శరీరంలోంచి బైటికి వచ్చి వాతావరణంలో కలిసిందంటూ విషపూరితం అవుతాయ్. మూత్రంలో నత్రజని ఉంటుంది కాబట్టి అది మొక్కలకు అవసరం. అంతేకానీ మనుషులు తాగొచ్చు, గాయాల మాన్పొచ్చు లాంటి అసంబద్ద థియరీలు ప్రపోజ్ చేయకూడదు. ప్రతీదీ వేదాల్లోనో ఉన్నాయిష అంటూ ఈసడించినట్లే ఉంటుంది మనోళ్ల నిర్వాకం. అసలు హోమియోని సైన్సే కాదంటుంటే, దానికో హోమియోపతిక్ సైన్స్ అని ఓ సభ పెట్టడం, దానికి లాలూ హాజరవడం, అంతటితో ఊరుకోకుండా ఈ ఉఛ్చపాఠాలు చెప్పడం (ఉఛ్చ అనేది బూతు కాదు..కాకపోతే బూతుల మధ్యలో వాడుతుంటారు కాబట్టి..అదీ బూతుకింద లెక్కేస్తున్నారు) ఏంటని జనం ఎద్దేవా చేస్తున్నారు
Laalu Prasad Yadav is well fimiliar person to Indian Politics. After his arrest he was away from elections. Now he entered his sons in to politics and got success. In a medical institute he commented on urine.