బిజెపిని తొక్కేస్తున్నారా బాబాయ్..!

27 Feb 2016                  లేటు వయస్సులో తండ్రవడమే కాకుండా, కేంద్రమంత్రి పదవి కూడా అనుభవించిన నటుడు కృష్ణంరాజు ఇప్పుడు మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుదామనుకుంటున్నట్లున్నారు. ఈ మధ్యే యాభైవ సంవత్సరపు నట వసంతాలను జరుపుకున్న కృష్ణంరాజు, పాలిటిక్స్ లో పోటీ చేసే ఉద్దేశం లేదన్నట్లుగానే మాట్లాడారు. ఐతే తాజా కామెంట్లు చూస్తుంటే రీ ఎంట్రీ ఇవ్వొచ్చనే అన్పిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రెస్ మీట్లో మాట్లాడిన రెబల్ స్టార్ టిడిపి బిజెపిని ఎదగనీయడం లేదని ఆరోపించాడు. పైకి రాకుండా పార్టీని టిడిపి తొక్కేస్తుందన్నాడాయన. అందుకే బిజెపి బలమేంటో తెలుపుతామని, రాజమండ్రిలో జరిగే సభ ఇందుకు నాంది అవుతుందన్నారాయన.                   బాహుబలి రిలీజ్ టైమ్ లో మోడీ దగ్గరకు ప్రభాస్ ని తీసికెళ్లిన కృష్ణంరాజు లోకల్ లీడర్లతో పెద్దగాకలవరని అంటారు. నా  రేంజ్ పెద్దదన్నట్లుగానే ఆయన ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా వాజ్ పేయ్ కలలు మోడీ నిజం చేశారు, ఈ మాటలు చూస్తే వాళ్లంతా నా సమకాలీకులన్నట్లు బిహేవ్ చేశారే కానీ, చిన్న స్థాయి లీడర్ల గురించిన ప్రస్తావన చేయరు కృష్ణంరాజు. అందుకే మార్చి 6 సభని తన రీ ఎంట్రీకి వేదిక చేసుకుంటారన్న సందేహం కలుగుతోంది.
Tollywood rebel star Krishnam Raju is not doing movies now. He worked as central minister and now he far from politics. But he recent activities are declare that he will participate in elections.