సూపర్ స్టార్ ఇరగదీస్తాడా

8 Feb 2016                సూపర్ స్టార్ కి వీరాభిమానులున్నారన్నది ఇప్పటి మాట కాదు. అది యాభైఏళ్ల నుంచి కొనసాగుతున్న అనుబంధం అంటారు. అందుకే ఆయన ఎప్పుడు ఏ క్యారెక్టర్లో నటించినా, ఆదరించేందుకు సిధ్దంగా ఉఁటారు. ఓవేళ బాగాలేకపోయినా పెద్దగా పట్టించుకోరు, జస్ట్ మా హీరో తెరపై కన్పిస్తే చాలనుకుంటారు. అలాంటి హీరో కృష్ణ ఇప్పుడు శ్రీ శ్రీ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. అందులో డిఫరెంట్ గెటప్ తో కన్పిస్తున్న కృష్ణ మళ్లీ వైభవం అందుకుంటారేమో అన్న అంచనాలు కలుగుతున్నాయ్. శ్రీశ్రీ లో విజయనిర్మల, నరేష్,సాయికుమార్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తైంది. ఇక డబ్బింగ్ కూడా శరవేగంగా పూర్తవుతోందట.

                     ఇందుకోసం  ప్రిన్స్ మహేష్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తాడని టాక్ వచ్చింది. సినిమా ఏప్రిల్ లోనో రిలీజయ్యే అవకాశం ఉంది. లేదంటే సూపర్ స్టార్ బర్త్ డే మే 31న రిలీజ్ అవ్వొచ్చని తెలుస్తోంది. ఈ సినమా డైరక్టర్ ముప్పలనేని శివ కెరీర్ బిగినైంది కూడా కృష్ణ నటించిన ఘరానా అల్లుడుతోనే. ఇప్పుడీ మూవీ హిట్ అయితే ఆ కృతజ్ఞత తీర్చుకున్నట్లే భావించాలి..
Tollywood hero Super Star Krishna is famous for experiments. Now he is doing a movie calle Sri Sri. Its shooting was completed and doing post production work.