ఆమె రహస్యం ఏంటి

9 Feb 2016                             మామూలుగానే రెండు కొప్పులు ఒకచోట ముడిపడవు అంటారు. ఇక బాలీవుడ్ లో హీరోయిన్ల సంగతి చెప్పనక్కర్లేదు టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్లలో ఫ్రెండ్లీ రిలేషన్ అనేది పెద్దగా కన్పించదంటారు. ఐతే రీసెంట్ టైమ్స్ లో మాత్రం హీరోయిన్లు బాగానే క్లోజ్ గా మూవవుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు హవా నడుస్తున్నదంతా ప్రియాంకదే పీపుల్స్ ఛాయిస్ నుంచి సెక్సీయెస్ట్ ఉమెన్ ఆప్ ఏషియా, ఆస్కార్ అవార్డ్ ప్రెజెంటర్ ఇలా ఎక్కడ చూసినా ప్రియాంక చోప్రా పేరే రీసౌండ్ వస్తోంది దీంతో ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందంటూ కైపు అందాల కట్రీనా కైఫ్ కామెంట్ చేసింది.

                           యాక్చువల్ గా కట్రీనా కైఫ్ స్కిన్ చూస్తే ఎవరైనా హాలీవుడ్ యాక్ట్రెస్  అనుకుంటారు. ఆమె వచ్చింది కూడా అక్కడ్నుంచే. అలాంటిది కట్రీనానే ప్రియాంక హాలీవుడ్ ఎంట్రీ పై మాట్లాడుతూ. అక్కడ సినిమాలు చేయాలంటే ఎంతో డేర్ కావాలని కాన్సన్ ట్రేషన్ కూడా అవసరమని, ఇవన్నీ ప్రియాంకకి ఉన్నాయని అందుకే అక్కడకు వెళ్తుందని కత్రీనా చెప్పింది. తన లేటెస్ట్ ఫ్లిక్ ఫితూర్ ప్రమోషన్ కి హాజరైన కట్రీనా ప్రియాంక సక్సెస్ సీక్రెట్లపై ఓ బుక్ రాయాలని కోరింది .
In Bollywood and Hollywood Priyanka Chopra name is hot topic. Recently she got $exyest women of Asian, and now she is going to represent Oscar awards. Katrina Kaif twitted about Priyanka, i want to know about her success secret.