కరిష్మా కపూర్ ని హింసిస్తున్నారట

27 Feb 2016                     ఒకప్పటి అందాల నటి ఇప్పటి హాట్ ఆంటీ కరీనా కపూర్ అక్క కరిష్మా 1990 నుంచి 2001 వరకూ ఆమెదే హవా. ఇప్పుడామె తన అత్తమామలు భర్త హింసిస్తున్నారంటూ పోలీస్ కేస్ పెట్టింది. సంజయ్ కపూర్ అనే బిజినెస్ మేన్ ను పెళ్లాడిన కరిష్మా కపూర్, ఇదివరకే అతని నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. ఐతే ఈ మధ్యలోనే విడాకుల కేసును పక్కనబెట్టి. ఫైనాన్షియల్ సెటిల్ మెంట్ కోసం ప్రయత్నాలు చేసారు ఇద్దరూ. ఆర్థికపరమైన సెటిల్ మెంట్ జరగకపోవడంతోపాటు తనని మెంటల్ గా కూడా భర్త అత్తమామలు హెరాస్ చేస్తున్నారంటూ కరిష్మాకపూర్ గృహహింస నిరోధ చట్టమైన 498/ఏ తో పాటు వరకట్ననిరోధ చట్టాన్ని కూడా వాడుకుంటూ కేసులు పెట్టింది. దీంతో సదరు సంజయ్ కపూర్ ఊచలు లెక్కపెట్టడం ఖాయమనే అనుకోవాలి. 

                    ఐతే ఇక్కడ సంజయ్ కపూర్ వెర్షన్ ఏంటంటే విడాకులు తీసుకోకుండా, పిల్లలను తన దగ్గర ఉంచుకని కరిష్మానే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుందట. పిల్లలను పావులుగా వాడుకుంటూ తన దగ్గర్నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుందంటున్నాడు. వీటిలో నిజాల సంగతెలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో సంజయ్ కపూర్ బోనెక్కకతప్పదు. ఏదెలా ఉన్నా ఫామ్ లో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ తో మూడు సినిమాలు గోవిందా తో మూడు సినిమాలు, సంజయ్ దత్ తో మూడు సినిమాలు, షారుఖ్ తో కూడా సినిమాలు చేసి ఫేడౌట్ అయిన కరిష్మా ఇప్పుడిలా గృహహింసకు లోనవడం బాధాకరమే..!
Bollywood hot heroin Karishma Kapoor file a case against her husband and his parents. She filed a case that he is harassing her.