ఆగిన మరో కమల్ సినిమా

4 Feb 2016


                      కమల్ హసన్ సినిమాలు ఎప్పుడు మొదలెడతాడో, ఎప్పుడు విడుదల చేస్తాడో తెలీదు. 60ఏళ్లు వచ్చినా 40ఏళ్ల లుక్ తో కన్పించే కమల్. ఆ మధ్య విశ్వరూపం టూ చేస్తున్నానని చెప్పాడు. దాని సంగతేమైందో తెలీదు. కెరీర్ లో ఇంకా వెనక్కి వెళ్తే మరుదనాయగమ్ పరిస్థితీ అంతే బ్రిటిష్ రాణి చేతులమీదుగానే ఓపెనైన ఈ మూవీ ఎప్పటికైనా చేస్తానంటాడు. విషయానికి వస్తే అమ్మానాన్నా-2 అంటూ అమలతో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పిన కమల్ అది ఆగిపోయిందని అనౌన్స్ చేశాడు. రీజన్ చెప్పలేదు కానీ అదే డైరక్టర్ తో రమ్యకృష్ణ హీరోయిన్ గా సినిమా చేస్తున్నాడు. 

                     ఇది బహుశా అమలను తీసేసిన విషయం చెప్పకుండా ఇలా చేస్తున్నాడేమో అన్పించకమానదు. టికె రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోవటంతో ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమాలో నటిస్తుండగా కమల్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కమల్ కూతురి పాత్రలో కనిపించనుంది. అమ్మా నాన్నాట లో కూడా శృతిహాసన్ నటిస్తుందని చెప్పడమే ఈ అనుమానానికి తావిస్తోంది. దాదాపు ఇరవైఏళ్ల క్రితం కమల్-అమల సత్య అనే సినిమాలో నటించగా. ఆ కాంబినేషన్ ఇప్పుడు కుదిరినట్లే కుదిరి మిస్సవడం ఆడియెన్స్ కు నిరాశ కలిగిస్తోంది.
Universal actor Kamal Hassan is always sensation in movies. His latest movie created sensation in at box office. Now he announced a film Ammananna-2. In this movie Sruthi Hassan is doing as his daughter role.