సొమ్మొకడిది సోకొకడిదా

9 Feb 2016


                               ఈ టైటిల్ తో సినిమా నాదే అయినా రియల్ లైఫ్ లో మాత్రం అలా కుదరదని చెప్తున్నాడు కమల్. మరుద నాయగం అనే సినిమా ఇరవై ఏళ్లక్రితం భారీగా ఓపైనై, ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా తీద్దామని లైకా ప్రొడక్షన్స్ ఛైర్మన్ సుభాస్కరన్ అనే వ్యక్తి కమల్ కు ఆఫరిచ్చాట్ట. ఐతే కమల్ హసన్ మాత్రం ఇది డబ్బులు కోసం ఆగిన సినిమా కాదు, చాలా రీసెర్చ్ వర్క్ చేయాల్సిన సినిమా ఐనా ఎవరో డబ్బులు పెట్టినంత మాత్రాన సినిమా చేసేరకం కాదు నేను అని సున్నితంగా తిరస్కరించాడట, ప్లానింగ్ ముఖ్యమని కూడా చెప్పాడట. 

                        ఇరవైఏళ్ల క్రితం బడ్జెట్టే వందలకోట్లుగా చెప్పిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీషూట్ చేయడం, పూర్తి చేయడం అంత తేలికైన పని కాదు. విషయం ఏదైనా కానీ కమల్ హసన్ కు ఇలాంటి ఆఫర్ రావడం దాన్ని ఆయన తిరస్కరించడం సరైన పనేనా అని చర్చ బయలు దేరింది, ఎందుకంటే ఈ వయస్సులో అంత భారీ బడ్జెట్ కమల్ హసన్ ఒక్కడే భరించడం అంత సులభం కాదు. ఇంకోరి అండతో ఫైనాన్షియల్ గా నెట్టుకువచ్చే అవకాశాన్ని కమల్ కాలదన్నుకున్నాడా అనేదే ఇప్పుడు ప్రశ్న. సినిమా రీసెర్చ్ కోసం ఇంకో మూడేళ్లు ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పటికైనా ఈ  సినిమా తీయాలనేది నా డ్రీమ్ అని కమల్ చెప్తుంటాడు. మరి డ్రీమ్ నెరవేరే టైమ్ ని ఎందుకు కాదంటున్నాడు ఇదే డౌట్.
Marudha Nayagam is Kamal Hassan movie which was stated before 20 years, and stopped. Now  Liaka Productions asked him to start that project, but Kamal Hassan rejected it.