లక్ అంటే ఇతగాడిదే

5 Feb 2016


                  రాజకీయం అంటే ఎప్పటికప్పుడు విజయాల తక్కెడలోకి జంప్ అవ్వడమే, కాకపోతే పుట్టుకనిచ్చిన పార్టీని వదిలి టిఆర్ఎస్ లో కి జంపైన కేకే ఆ  పార్టీ తరపున రాజ్యసభ సీటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత టిఆర్ఎస్ కు జనరల్ సెక్రటరీ అనే పదవి కూడా వెలగబెడుతుండగా ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి ఇప్పుడు టిఆర్ఎస్ కార్పొరేటర్ గా ఎంపికైంది. అసలు మేయర్ సీటు బిసీ మహిళకు ఫస్ట్ రిజర్వ్ చేసింది ఆమె కోసమే అని అంటారు. 

             ఐతే తిరిగి మళ్లీ బిసి జనరల్ గా రిజర్వేషన్ మారింది..ఇప్పుడీ ఎన్నికతో తిరిగి ఆమెకే మేయర్ పీఠం దక్కించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈపాటికే ఆ రకంగా కేకే కేసీఆర్ మధ్య ఒప్పందం కుదిరిందని టాక్ ఏదైనా సరే నమ్ముకున్న పార్టీని నట్టేట ముంచి సెంటిమెంట్ అంటూ టిఆర్ఎస్ లో చేరిన కేకే ఈ రకంగా తన వారసులను కూడా రంగంలోకి విజయవంతంగా  దించేశాడంటున్నారు. ఐతే ఈయనగారి కొడుకు ఓ హత్య కేసులో నిందితుడు రేపో మాపో మనోడు కూడా ఇక రంగంలోకి దిగుతాడేమో. రాజకీయం తెలిసిన మనిషి కాబట్టే అర్దం పర్ధం లేకుడా ఎవరికీ అర్ధం కాని లాంగ్వేజ్ వాడుతూ కన్ఫ్యూజ్ చేస్తూ తన పని మాత్రం చక్కబెట్టేసుకోవడంలో కేకే నంబర్ వన్ అని అర్ధం అవుతోంది. ఇది అర్ధం కాని వాళ్లు మాత్రం పాపం టిఆర్ఎస్ లో  ఎప్పట్నుంచో కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు.
KK is very lucky in politics. Recently he jumped in to TRS and got MP seat, now his daughter Gadwala Vijaya Lakshmi got GHMC mayor seat.