కేసీఆర్ నోటికి ఏది తోస్తే అదే

10 Feb 2016


                      ఒకప్పుడు ఉపఎన్నికల్లో విజయాలు, తప్ప అసలు ఎన్నికల్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేని టిఆర్ఎస్ ప్రత్యేకరాష్ట్రంలో మాత్రం ఇరగదీస్తూ పోతోంది. దాదాపుగా ప్రతీ ఎన్నికల్లో తన హవా చూపిస్తున్న టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి గా మారిన తర్వాత మాటలకు మరింత వేగం వచ్చేశాయ్. కోటలు ఎప్పుడో దాటించేస్తున్నారు. తాజాగా నారయణ్ ఖేడ్ లో బై ఎలక్షన్ జరగబోతోంది. అక్కడ ప్రచారంలో కూడా కేసీఆర్ ఆ పట్టణాన్ని సిధ్దిపేటలా చేస్తామంటూ హామీ ఇచ్చారు. 150 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, ఇక్కడో బుల్లెట్ మంత్రి ఉండు, అంటూ మేనల్లుడికి కితాబు ఇచ్చారు. ప్రజలు ఓట్లేస్తున్నారు సగంమంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నా వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లదే గెలుపు కాబట్టి సరిపోతుంది. కానీ సిటిలో నిమ్స్ ఆస్పత్రిలో కరెంట్ లేక పేషెంట్లు అల్లాడుతున్న సంగతి ఆయనకు పట్టదా, అలానే డయాలసిస్ కోసమని కిడ్నీ చెడిపోయిన రోగులు మిషన్లు లేక క్యూలో పడిగాపులు గాస్తున్నారు. సిఎంగా మారగానే కేసీఆర్ నిమ్స్ కి నిధులు మంజారు చేసామన్నారు. మరి ఇంతవరకూ అవి అమరకపోవడాన్ని ఏమనాలి ఏ హామీ గుర్తొస్తే అది ప్రకటించేయడం. తల నరుక్కుంటాననడం, ఎదుటిపక్షాలను దద్దమ్మలనడం దానికి జనం చప్పట్లు కొట్టడం ఇప్పుడు బానే ఉఁది. రేపు అసలు సత్యం తెలిసినప్పుడు పరిస్తితి ఏంటనేదే ఆలోచించుకోవాలి. ఐనా ఐదేళ్లు పవర్ పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్లీ గెలిస్తే ఏంటి గెలవకపోతే ఏంటి అంటారా. లేకపోతే అవతలోడు మనకన్నా సన్నాసైన తర్వాత మళ్లీ మనల్నే గెలిపిస్తారనే ధీమానా..!
In Telangana TRS are going with victories, Recent GHMC elections results, Warangal Results are TRS wining. Present Narayan Ked bi elections are going ahead for that KCR giving promises.