టిడిపిని ఖాళీ చేసే కుట్ర జరుగుతోందా..?

18 Feb 2016                             ఈ మాట ఎవరైనా  అంటే మీదపడిపోయే తెలుగు తమ్ముళ్లకు కొదవలేదు, కానీ సాక్షాత్తూ రేవంత్ రెడ్డే ఇలా వాపోయారు. పార్టీలో అంతా జంపైన తర్వాత తెలంగాణలో ఎల్పీ నేతగా ఎంపికయ్యారాయన. కేడర్ తో వరస భేటీలు చేస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పార్టీని కనుమరుగు చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఐతే ఇక్కడ గమనించాల్సింది రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని, దానికి తగ్గట్లుగానే మునిగిపోయే ఓడ లాంటి టిడిపిని నమ్ముకుంటే ప్రయోజనం లేదనే ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి జంపయ్యారు. ఐతే అది గమనించకుండా అధికార పార్టీ టిడిపిని ఖతం చేసే కుట్ర పన్నిందనడం అవివేకం. ఆ మాటకి  వస్తే, పార్టీ ఎంపిగా కూడా ప్రమాణస్వీకారం చేయకముందే. పచ్చకండువా కప్పుకున్న ఎస్పీవై రెడ్డి ఉదంతం ఏంటో కూడా టిడిపి నేతలు గుర్తు చేసుకోవాలి. తాము చేస్తే సంసారం ఎదుటి వాళ్లు చేస్తే ఇంకోటన్నట్లు వ్యవహరించడం ఎందుకు. జనం చేత శుద్దులు చెప్పించుకోవడం అవసరమా. 

                             ఇప్పటికే ఏపీలో ఓ పది మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ కొడతారంటూ ఆ పార్టీనేతలే వైసీపీపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇలాంటప్పుడు జగన్ రేవంతరెడ్డికన్నా ఎక్కువగా హడావుడి చేయాలి. అదేం లేదు కాబట్టే ఇంతవరకూ ఏపీలో జంప్ జిలానీల సంఖ్య కన్పించడం లేదు. రేవంత్ రెడ్డికి మాత్రం పార్టీ ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్ రెడ్డి జంప్ కొట్టిన రోజు నిద్రే పట్టలేదన్నారు. కానీ దీనికి తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అంటూ వాపోవడానికి ఏం సంబంధమో ఆయనకే తెలియాలి. అక్కడికేదో తెలంగాణ పోరాటంలో తెగ పాల్గొన్నట్లు బిల్డప్ ఇస్తే అన్నా తమని నమ్ముతారనే ఆశేమో మరి.
In Telangan state all TDP leaders are jumping into TRS party. Recently 10 MLC gave notice to merge them into TRS. But now Revanth Reddy elected ap LP leader.