ఇవైనా సరిగా చేయండి

8 Feb 2016


                      గోదావరి పుష్కరాలు ఏ తీరున జరిగాయో అందరికీ గుర్తుంది. తెలంగాణలో చాలా చోట్ల నీళ్లు లేక ప్రాజెక్టునుంచి పంప్ చేయడం, షవర్ బాత్ లు కొన్ని చోట మట్టినీటిలోనే మడ్ బాత్ లు కూడా చేయాల్సి వచ్చింది. ఇక ఏపీ రాజమండ్రిలో ఎంత విషాదం  చోటు చేసుకుందో ఎవరూ మర్చిపోలేరు. ఈలోపే కృష్ణా పుష్కరాలు తోసుకొచ్చేశాయ్. ఏపీలో అప్పుడే దీనికోసం 900కోట్లకి పైగా ప్రతిపాదనలు కూడా సిధ్దం చేసేశారు. ఇక తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా కృష్ణా పుష్కరాలు ఘనంగా చేయాలంటూ సూచనలు చేస్తున్నారు. 

                    అసలు కృష్ణా పుష్కరాలకు కావాల్సినంత సమయం ఉంది, ఓ పద్దతి ప్రకారం చేయకుండా ఏదో పెళ్లి పనుల్లా చేస్కుంటూ పోతే పెళ్లి వస్తుంది, వచ్చింది, ఐపోయింది, ఐతే పనులు మాత్రం జరుగుతూనే ఉన్నట్లు. చివరికి పుష్కరాలు జరుగుతున్న సమయంలో కూడా ఇంకా ఘాట్ లు కడుతుంటారు. అవి నీటిలో కొట్టుకుపోతూనే ఉఁటాయన్నట్లు చేయకూడదు. గోదావరి పుష్కరాల అనుభవంతోనైనా రెండు ప్రభుత్వాలు బడాయికి పోకుండా సజావుగా చేస్తే చాలని జనం కోరుకుంటున్నారు.పలానా ముహూర్తానికే మునగాలి, లేకపోతే కొంప మునిగిపోతుందనే స్థాయి ప్రచారాలు మానుకోవాలి.
AP government told we will Godhavari Pushkaralu perfectly. But very bad incidents were taken place in Godhavari Pushkaralu. Now Krishna Pushkaralu are coming soon, for that AP released 900cr. Lets see how they will do this.