ఎట్టకేలకు విలన్

18 Feb 2016


                        విలన్ అనే ఓ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. బీభత్సమైన హెయిర్ కట్ తో రాజశేఖర్ అందులో డబుల్ రోల్ లో నటించాడు. అజిత్ తమిళ్ లో చేసిన ఆ సినిమాకు రీమేక్ గా శింగనమల రమేష్ మనోడితో అదే పేరుతో తీయగా రిజల్ట్ పేలిపోయింది. ఇప్పుడు పేరు ముందు హీరో తప్ప సినిమా వేషాల్లేని రాజశేఖర్ తన ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. పట్టపగలు అనే సినిమా పూర్తైకూడా విడుదల కాకుండా షెడ్ లోనే ఉేండిపోయింది. 

                  ఐతే ఒకప్పుడు తాను డైరక్టర్ గా ఫస్ట్ సినిమా ఛాన్సిచ్చి మరీ విసిగించిన తేజ డైరక్షన్లో ఓ సినిమా రాబోతోంది.దాని పేరు అహం. అందులో విలన్ గా చేయబోతున్నాడట రాజశేఖర్. హీరో పాత్రలకంటే విలన్లను బ్రహ్మాండంగా చూపించే తేజ, రాజశేఖర్ ను చక్కగా చూపిస్తాడని టాక్. ఐతే ఇందులో రాజశేఖర్ కు జోడీగా స్టార్ హీరోయిన్ నటించబోతోందట. ఐతే ఇది యాంటీ హీరోనా..లేక నిజంగానే విలనా అనేది సినిమా పూర్తై రిలీజైతే కానీ తెలీదు. అసలు తేజని ఓ రేంజ్ లో విసిగించిన వాళ్లలో రాజశేఖర్ కే ఫస్ట్ ప్లేస్ అంటారు. అలాంటిది ఈ వెరైటీ కాంబినేషన్ బైటికి రావడం నిజంగా విచిత్రమే అవుతుంది.
Present hero Rajashekar has no movies in Tollywood. His recent movie Patta Pagalu has not released till now. Now he is doing as villain in The direction of Teja.