గ్రేటర్ లో కింగ్ ఎవరు.

2 Feb 2016


                 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. ఇది ఓ ప్రవేట్ ఛానల్ చేసిన సర్వేలో తేలింది. అంతకుముందు వంద సీట్లతో మేయర్ పీఠాన్ని గెలుచుకుంటామని కేటీఆర్ సవాల్ చేయడం. దాన్ని రేవంత్ రెడ్డి స్వీకరించడం, నారా లోకేశ్ ప్రచారం చేయడం వంటి అంశాలతో హీట్ పెరిగింది. ఐతే చివర్లో ఈ-ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందంటూ చెప్పడంతో సందేహాలు వచ్చాయ్. దాంతోపాటు అసలు కేటీఆర్ సవాలే విసరలేదనడం ఖచ్చితంగా టిఆర్ఎస్ 100సీట్లు గెలవలేదనడానికి నిదర్శనంగా చెప్పారు..ఇప్పుడు ఆ ప్రవేట్ ఛానల్ సర్వే ప్రకారం ఉన్న 150 వార్డుల్లో టీఆర్ఎస్ కు 63 సీట్లు మాత్రమే దక్కుతాయి. ముస్లిం పార్టీ ఎంఐఎంకు 33వార్డులు. టిడిపి-బిజెపి సంయుక్తంగా 25వార్డులు గెలుస్తాయని చెప్తోందా సర్వే. హస్తం పార్టీ మరోసారి బొక్కబోర్లా పడి ఐదు వార్డులకు పరిమితం అవుతుందని ఆ ఛానల్ సర్వే తేల్చింది. హోరాహోరీగా 22వార్డుల్లో పోరు ఉంటుందని ప్రీ పోల్ సర్వే చెప్పింది. ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బగానే భావించాలి. వందసీట్లెక్కడ 63సీట్లెక్కడ. ఐతే ఇదంతా అంచనానే మరి హోరాహోరీ పోరు నెలకొన్న వార్డులను కూడా టిఆర్ఎస్ ఖాతాలో వేసినా దక్కేది 85. అంటే ఈ సర్వేనే నిజమైతే, ఇక కేటీఆర్ సన్యాసానికి సిధ్దమవ్వాలి..లేదూ వందసీట్లు తెచ్చుకుందా.
      ఇక రేవంత్ రెడ్డి కొడంగల్ లో సీటుకు నీళ్లొదులుకోవాలి. ఐతే ఇక్కడ ఓ అంశం గమనించాలి. సీమ,కోస్తా,ఆంధ్రావాసులు ఈ ఓటింగ్ లో పెద్దగా పాల్గొనలేదంటున్నారు. అలానే వైఎస్సార్సీపీ కూడా పోటీలో లేదు. ఈ రెండు అంశాలు కూడా ఖచ్చితంగా పెద్ద మార్పునే కలగజేస్తాయ్. సీమాంధ్రవాసుల్లో వైఎస్సార్సీపీ అంటే అభిమానం ఉఁది. అలానే ఆ ఓటర్లంతా ఖచ్చితంగా టిడిపికి ఓట్లు వేసి ఉంటేనే ఈ ఛానల్ అంచనా వేసిన సీట్లు అంటే 25 వార్డులు. దానికి తోడు మరో 10 వార్డులు గెలుచుకోగలుగుతుంది. ఓ వేళ టిడిపి, వైసీపీ ఓట్లను వేయించుకోలేని పక్షంలో భారీ భంగపాటు తప్పదు. అలా జరగని పక్షంలో  టీఆర్ఎస్ కు గణనీయమైన ఓట్లు వచ్చినట్లు అర్ధం చేసుకోవాలి.
GHMC elections polling was completed today. So some of the private channels released exit poll results. In this results Congress lost its name. May be KTR was failed in his open Challenge.