పంచాయితీలకు నిధుల వరద పారుతుందా..?

29 Feb 2016                           కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షికబడ్జెట్ తో గ్రామ పంచాయితీలు. మున్సిపల్ పట్టణాలకు నిధుల వరద పారుతుందని మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. గత కేటాయింపుల కన్నా ఈ ఏడాది వాటిని రెండొందల శాతం పెంచామని చెప్పారాయన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణై జైట్లీ స్వపరిపాలనకు ఊతమిచ్చే పంచాయితీలు, మున్సిపల్ పట్టణాలకు నిధులు కేటాయింపులో పెద్ద పీట వేశారు. మొత్తం బడ్జెట్ లో 2.87 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. ఇది గత ఐదేళ్లలో కంటే ఇది 228 శాతం ఎక్కువని జైట్లీ ప్రకటించారు. ప్రతి పంచాయితీల 80 లక్షలు, మున్సిపాలిటీలకు 21 కోట్ల వరకు నిధులు ఇవ్వబోతున్నట్లు లోక్ సభలో ప్రకటించారు. ఈ నిధులు విడుదలకు సంబంధించిన విధివిధానాలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత విడుదల చేస్తామన్నారు అరుణ్ జైట్లీ ఐతే ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. నిజంగా రాష్ట్రాల సలహాలు తీసుకుంటారా లేక తమకి నచ్చినవాళ్లకే కేటాయింపులు చేసుకుంటారా అనేది డౌట్.

                          14న ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు పెంచామంటున్న అరుణ్ జైట్లీ 2022నాటికి అన్ని గ్రామాల్లో కరెంట్ చూడాలనేది తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 18వేల గ్రామాల్లో కరెంట్ లేదని..వచ్చే మూడేళ్లలో అందులోని 1000 గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇ్చచారు.  అందుకోసం గ్రామాల విద్యుద్దీకరణకు 8500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధికి 87 వేల కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ కనెక్షన్లకు 2 వేల కోట్లు కేటాయింపులు దక్కాయి.
In Union Budget 2016 Arun jetly announced in Lokshaba about funds to Muncipalities and Panchayities. After contacting state government we will release amount.