పాపం వర్మ

27 Feb 2016                         వర్మ తన గురించి తానేం అనుకుంటాడో, కానీ లోకంలో ఏవిషయంపైనైనా, ఎలాగైనా స్పందించగల అర్హత తనకి ఒక్కడికే ఉందని అతగాడి ఫీలింగ్ అనుకుంటా. సినిమాహిట్ల సంగతి ఏమో కానీ ట్వీట్లతోనే కాలం నెట్టుకొచ్చే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు బెజవాడలో తెగ హడావుడి చేస్తున్నాడు. వంగవీటి మోహనరంగా గురించి అంతా తెలుసు, నాకే తెలుసు అంటూ ముందు బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు తెగ పరిశోధన చేస్తున్నానంటూ ఫోజులు ఇస్తున్నాడు. పైగా అక్కడి నేతలను కలిసి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాడు. ఆ గొడవ చేస్తుండగానే, మరోవైపు ముద్రగడ పద్మనాభమే అసలు మెగాపవర్ స్టార్ మిగిలినోళ్లు ఫేక్ స్టార్సంటూ మాట్లాడేశాడు. ముద్రగడ పార్టీ పెడితే చేరతానంటాడు. మరోవైపు రాజకీయాలపై నమ్మకం లేదంటాడు. చూస్తే పాపం వర్మ విపరీతమైన ఐడెంటిటీ క్రైసిస్ తో పబ్లిసిటీ పిచ్చతో బాధపడుతున్నట్లు అర్ధమవుతోంది. 

                            ఇదే ఒపీనియన్ తో కాంగ్రెస్ లీడర్లు ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చమంటున్నారు. ఐతే కనీసం నాకు మైండైనా ఉంది. అది కూడా లేకుండా బతకొచ్చని కాంగ్రెస్ లీడర్లు ప్రూవ్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశాడు ఆర్జీవీ. మనోడిని సరిగా గమనిస్తే కేఏపాల్ కూడా ఒకప్పుడు ఇలానే ప్రేలాపించేవాడంటున్నారు. ఎంతో టాలెంట్ ఉందనుకునే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చివరికి ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇంత చీప్ గా బిహేవ్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఇంతా చేసి ఆ  సినిమా కనీసం పదిరోజులైనా ఆడుతుందా లేదాని అసలు పదిరోజులు ఆడితే చాలు కదా, డబ్బులొచ్చేస్తాయ్. ఇదే అతగాడి ప్లాన్ ఫ్రీ పబ్లిసిటీ ఎటూ ఉండనే ఉంది..
Ramgopal is very sensational director. Now very popular with twitter. Now he is busy with Vangaveeti movie story.