బొందా ఉమా..!

26 Feb 2016                      రైల్వే బడ్జెట్ చూసినవాళ్లకు ఎవరికైనా ఎలాంటి మెరుపులు లేవని ఈజీగానే అర్ధం అవుతోంది. కానీ టిడిపి నేత బొండా ఉమామహేశ్వర్రావ్ కి మాత్రం చాలా సంతృప్తిగా ఉందట పైగా అదేదో ఈయనే సొంతంగా సాధించుకు వచ్చినట్లు బిల్డప్స్ ఇవ్వడం చూస్తే ఎవరైనా ఈయన దగ్గరే శిక్షణ తీసుకోవాలేమో అన్పించకతప్పదు. 

ఫ్రైట్ కారిడార్ తో ఏపీకి 8వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కోతలు కోసేస్తున్నాడాయన. ఇంతకన్నా అజ్ఞానం మరోటి ఉండదని అంటున్నారు. ఎన్నో ఏళ్లనుంచి చూస్తున్నకోటిపలి-నర్సాపురం ప్రాజెక్టుకు 200 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి మార్గానికి పిఠాపురం- కాకినాడ లైనుకు 50 కోట్లు, నంద్యాల-యర్రగుంట్లకు 100 కోట్లు, విజయవాడ-భీమవరం-నిడదవోలు డబ్లింగ్‌, విద్యుదీకరణకు రూ.80 కోట్లు ఇవీ వస్తాయంటున్న డబ్బులు. అసలు కిలోమీటర్ కు నేషనల్ హైవే పై రోడ్ వేయాలంటే కనీసం అయ్యే ఖర్చు కోటిన్నరపైమాటే, అలాంటిది ఓ రైల్వే ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుందో ఏమైనా తెలుసా. నడికుడి శ్రీకాళహస్తి దూరం చూస్తే 300కిలోమీటర్ల పై మాటే, దానికి ఖర్చు కనీసం వెయ్యి కోట్లకు పైనే అవుతుందని ఎవరికైనా తెలుస్తుంది. మరి బొండా ఉమకి రైల్వే ఇచ్చిన 50కోట్లు ఎవరికి సరిపోతాయే ఏమైనా తెలుస్తుందా. 
                   అక్కడికేదో మిగిలిన పార్టీలు మీదపడిపోతాయేమో అన్న భయంతోనే ఇలా ముందే చాలా తెచ్చుకున్నామన్న భ్రమ కల్పిస్తే వదిలేస్తారనే సోంబేరీ ఆశలేమో కానీ జనం అందరికన్నా తెలివైనోళ్లు 
ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడెక్కడ రైళ్లు వచ్చింది. ఎవరి హయాంలో ఎన్నెన్ని ప్రాజక్టులు వచ్చిందీ అందరికీ తెలుసు. బిజెపిని నిలదీసి రాష్ట్రానికి ప్రాజెక్టులు తెచ్చుకునే దమ్ము లేదు కానీ ఊకదంపుడు ముచ్చట్లు మాత్రం చెప్తే సరిపోతుందని అనుకుంటున్నట్లున్నారు టిడిపి నేతలు.
Today central government introduced Railway budget, it is fake budget, it does not favor to AP. But TDP MLA bonda Uma is telling about it as he is satisfied.