ఆయనొస్తే ఇబ్బందే

22 Feb 2016                          టిడిపిలోకి భూమానాగిరెడ్డి చేరిక పై అక్కడ అసంతృప్తులు బయల్దేరాయ్. భూమా నాగిరెడ్డి పార్టీలోకి రావడం తమకి ఇష్టం లేదని, ఈ విషయం ఎప్పుడో చంద్రబాబుకే చెప్పామని శిల్పా చక్రపాణిరెడ్డి, మోహన్ రెడ్డిలు అంటున్నారు. మేం అంటే లీడర్లం కాబట్టి, ఇవాళ ఓ పార్టీలో రేపు మరో పార్టీలో ఉంటామని. కానీ కార్యకర్తలు అలా కాదని వారి రాకతో అసంతృప్తులు ఎక్కువ అవుతాయని అంటున్నారు వారు. సర్దుకుపోవడం కూడా అంత తేలిక గాదని శిల్పా బ్రదర్స్ కుండబద్దలు కొడుతున్నారు.

                           వాస్తవానికి శిల్పా బ్రదర్స్ తో చంద్రబాబు భూమా చేరిక గురించి కానీ, ఇతర ఎమ్మెల్యేలను తీసుకునే అంశంపై కానీ. ఇప్పటికే పలుదఫాలుగా చర్చించారంటారు. ఐతే భూమా చేరికతో తమ ప్రాబల్యం ఉన్నచోట పాతుకునేందుకు నాగిరెడ్డి వర్గీయులు ప్రయత్నం చేస్తే సహించేది లేదని శిల్పా బ్రదర్స్ చెప్పారట. ఐనా చంద్రబాబు ఈ అంశంపై లైక్ మెండెడ్ పీపుల్ అంటూ రొటీన్ డైలాగ్ వేయడంతో ఇక విషయం బాబుకే వదిలేయడం బెటరనేది శిల్పా బ్రదర్శ్ వైఖరిగా తెలుస్తోంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలోనూ జేసీ బ్రదర్స్ తో ప్రభాకర్ చౌదరి..పరిటాల వర్గం ఇలా మూడు ముక్కలాట ఆడుతుండగా కోరి కోరి మరో కొరివితో చంద్రబాబు గోక్కుంటున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
Latesh hot new in media in YSRCP leader Bhuma Nagi Reddy is joining into TDP. About Bhuma joing into TDP some leadrs in TDP are opposeing. TDP leader Silpa Chkrapaani Reddy is quetly opposite about Bhuma joining into TDP.