భస్మాసుర హస్తం

5 Feb 2016


                జిహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ కు చుక్కలు చూపించాయ్. పార్టీకి నంబర్ వన్ స్థానమే కట్టబెట్టారు. ఐతే అది విజయాల్లో కాదు పరాజయాల్లో అన్ని డివిజన్లలో పోటీ చేసి ఇంతలా ఓడిపోవడం సిగ్గు చేటు కాక మరేంటని పార్టీ కేడర్, నేతలు అందరూ నిరాశలో పడిపోయారు. అసలు మేయర్ కాండిడేట్ కూడా ఓడిపోవడం ఆ పార్టీ ప్రస్తుత గతేంటే తెలియజేస్తోంది. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డిదీ అదే దారి అధికారంలో ఉన్నన్నాళ్లూ పేజ్ త్రీ ఫంక్షన్లకు హాజరవడం, భర్త ఆగడాలు చూసిన జనం ఆమెకి సరైన బుద్ది చెప్పారంటున్నారు. 

               ఇంత జరిగినా  సిగ్గు లేకుండా ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని వాపోవడం నవ్వు తెప్పించకమానదు. టిఆర్ఎస్ తెలంగాణకు కవలపిల్లలా ఉన్నంతకాలం, అలా నమ్మించినంత కాలం జనం టిఆర్ఎస్ కే పట్టం గడతారని ఈ ఎన్నికలతో రుజువుకాగా అడ్డగోలు విభజన చేసిన పాపం కాంగ్రెస్ అంటే సిటీఓటర్లలో కూడా ఏ స్థాయిలో కోపం ఉందో తెలియజేసింది.
Congress hand is present iron hand. In 2014 general elections people gave good shock to Congress. Now also it was very bad to congress, in GHMC elections also Congress got good shock.