కమెడియన్ రిటర్న్స్

10 Feb 2016


                           ఆంధ్రాపల్స్ కథనం కమెడియన్ కమ్ హీరో శివాజీలో కదలిక తెచ్చినట్లుంది, తన గొంతు విన్పించే టీవీ9లో మరోసారి రెచ్చిపోయాడు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంతటి త్యాగానికైనా సిధ్దమంటూ మరోసారి పిలుపులు ఇచ్చాడు, ప్రత్యేక హోదా అంటూ ఇవ్వకపోతే ప్రతీ వీధీ తిరిగేస్తానంటూ ఢంకా భజాయించాడు మనోడు. అర్రర్రే ఇన్నాళ్లూ ఎక్కడకు పోయావ్ రా బాబూ అంటే సమాధానం లేదు కానీ. మనోడు ఏం మాట్లాడినా టీవీ9లో మాత్రం లైవ్ లో వచ్చేస్తుంది. పూర్వాశ్రమంలో శివాజీ,రవిప్రకాష్ జెమినీలో చేసిన బంధంతో ఇతగాడిని ప్రమోట్ చేయడానికి టీవీ9 పడే తపన చూస్తే ముచ్చటేస్తుంది. కానీ చిత్తశుద్ది లేని శివాజీమాటలేల అని జనం నవ్వుకుంటుంటారు..ఎందుకంటే వీళ్లు టీవీల్లో గంభీరంగా ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప, నిజంగా చేసేదేం లేదు. 

                           కనీసం వార్డు మెంబర్ గా కూడా పోటీ చేయకుండానే ప్రధానమంత్రిపై కూడా విమర్శలు చేయడం మన ప్రజాస్వామ్యం గొప్పతనం అయితే అయి ఉండవచ్చు కానీ. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు డిమాండ్లు పెట్టడం మాత్రం ఖచ్చితంగా హాస్యాస్పదమే. ఇప్పుడెటూ  పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ హడావుడి చేసి ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అవడం తప్ప నిజంగా ఓ మూడు రోజులైనా జైల్లో గడిపితే అప్పుడు త్యాగం అనే  పెద్ద పదం వాడటానికి అర్హులు అవుతారు. గడ్డం పెంచిన పెతీఓడూ గ్యాంగ్ లీడర్ కాలేరు, కండువా కప్పిన పెతోడూ పెద్ద మనిషి కాలేడనే ఏపీవాసులు సెటైర్లు విన్పించుకోండి సార్..!
AP Special status Form leader Sivaji again appeared in TVs. Again he talked about special status. But he was missing form last six months. Always his talks was live telecast by TV9, because Sivaji and Ravi Prakash were work together.