చిరంజీవికి చట్టం తెలీదా

2 Feb 2016               ఏపీలో ప్రత్యక్షపోరాటాలకు కాంగ్రెస్ కాలం చెల్లిందని అనుకుంటున్నట్లుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ ఎంపీ హోదాలో రాజధాని గురించి ఓ లేఖ రాశారు. ఐతే ఇది కూడా మంత్రి నారాయణ అపహాస్యం చేస్తున్నారు. అసలు చిరంజీవికి చట్టమే తెలియదు పొమ్మన్నారు. ఏదిపడితే అది మాట్లాడి రైతులను రెచ్చగొట్టొద్దంటూ అసహనం వ్యక్తం చేశారు ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, చిరంజీవికి అసలు ఏం అవగాహన ఉందని చంద్రబాబుకు లేఖ రాశారని చిరంజీవిపై మండిపడ్డారు నారాయణ. ప్రభుత్వం చట్ట ప్రకారం చేస్తుందంటూ సీఆర్డీఏ యాక్ట్ గురించి చెప్పుకొచ్చారు. లక్షా 9వేలమంది రైతులు ఉన్నారు కాబట్టి సమస్యలు వస్తూనే ఉంటాయని వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని సెలవిచ్చారు మంత్రిగారు.
                ఐతే మంత్రి నారాయణ ఇక్కడ గమనించాల్సిన అంశం సిఆర్డీఏకి చట్ట బద్దత ఉందో లేదో చూడాలి. అసలు సీఆర్డీఏ అనే రాజధాని నిర్మాణం కోసం కానీ. అదేదో 50 ఏళ్ల నుంచి అమలువుతున్న చట్టంలా చెప్పుకోవడం తప్పు, ఏ ప్రకారం ఎంత భూమి లాక్కోవడానికి వీలవుతుందో. అలా రూల్స్ రాసుకుని తయారు చేసుకున్న చట్టాన్ని రెగ్యులర్ చట్టాలతో పోల్చడం సరికాదు. అసలేచట్టమైనా జనాల కోసమే కానీ, చట్టాల కోసం జనాలు బతకరు. ఇదే సూత్రం బతుకు జీవనచిత్రంలో ఏ సందర్భంలో నైనా అన్వయించుకోవాలి. అప్పుడే చట్టాలు సమాజానికి రక్షణ కల్పిస్తాయి లేదంటే అడ్డుగోడలుగానే మిగిలిపోతాయ్.
AP Congress leader, MP Chinranjeevi wrote a letter to AP CM Chandrababu about AP Capital. For this AP Municipal minister Narayana was fired on Chiranjeevi, what do you know about rules.