చిరుపై ఎల్లో మీడియా ప్రచారం

27 Feb 2016                         మెగాస్టార్ చిరంజీవిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది నో డౌట్ కావాలంటే ఇవాళ్టి ఓ దమ్మున్న పత్రిక నెట్ ఎడిషన్ చూడండి. పశ్చిమగోదావరి జిల్లాలో చిరంజీవి టూర్ సంగతి లోకల్ లీడర్లకు తెలియదట, వైసీపీ నేతకు తెలిసిందట కాబట్టి ఆయన వైసీపీలో చేరుతున్నాడా అంటూ ఓ కాప్షన్ పెట్టి కథనం వండేసింది. అంతకు ముందు చిరంజీవి ఇక బిజెపిలో చేరతాడంటూ ప్రచారం కూడా ఎల్లో జనాల స్క్రిప్టే అంటారు. ఎప్పటికప్పుడు చిరుపై వార్తలు రాసుకుంటే తమ రేటింగ్ పెరుగుతుందనే భ్రమలో ఉన్న ఓ వర్గం మీడియా అందుకు సిధ్దంగా కొన్ని స్టిల్స్ పెట్టేసుకుని తెగ కథనాలు వండేస్తున్నాయి. ఓ వైపు భుజం ఆపరేషన్ చేయించుకుని చిన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు చిరు అంత హడావుడిలో కూడా తానే పార్టీ మారడం లేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు.                       ఐనా తన పైత్యం తగ్గించుకోలేదు ఎల్లో మీడియా మొగల్తూరు పర్యటనలో కాంగ్రెస్ లీడర్లకు అస్సలు సమాచారం లేదని. అదే వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి మాత్రం వారం ముందే సమాచారం ఉందంటూ రాసేసింది. ఇదంతా కాపుసంఘం నేతల వరకే పరిమితమైన పర్యటన అయినా, పార్టీ కార్యక్రమంలా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలేదో చిరంజీవిపై మండిపడ్డట్లూ, చిరంజీవి వాళ్లని పట్టించుకోనట్లూ స్టోరీ అల్లేశారు.
A yellow media is writing about Chiranjeevi to increase their rating. Chiranjeevi is busy with his trip in West Godhavari, and his daughter marriage, This paper wrote like this.