సొంతూళ్లో చిరు

22 Feb 2016                          మెగాస్టార్ , రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఇప్పుడు మళ్లీ జనంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కొట్టిన దెబ్బకి ఏపీలో మటాషైన పార్టీ తరపును చాన్నాళ్లు జనానికి దూరమైనా మనోడు మాత్రం చాలా తెలివైనోడు కాబట్టే అప్పుడు పార్టీని కాంగ్రెస్ సముద్రంలో కలిపేసినా, రాజ్యసభకు ఎంపికయ్యాడు. అదే ఎంపిగా అయితే మళ్లీ శంకరగిరి మాన్యాలు పట్టేసీఓడే ఇప్పుడు ఏ మాత్రం బిజెపి కాస్త సందిచ్చినా దూసుకెళ్లగల దిల్లున్నోడు చిరు. ఏనాటికైనా కాంగ్రెస్ బతక్కపోదా, తానే ఓ వెలుగు వెలగనా అన్నట్లు అటు రఘవీరా ఇటు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ లో తెగ తిరిగేస్తున్నారిప్పుడు.


                        పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంలో చిరు ఇప్పుడు 5కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేయించారు. అందులో విడతల వారీగా ఒక్కో పనికీ డబ్బులు ఖర్చు పెడుతూ పేరు తెచ్చుకునే పనిలో పడ్డాడాయన. అటు కాపు సభకి వెళ్లకపోయినా ముద్రగడ రగడ ముగిసి దీక్ష విరమించే సమయానికి హాజరేయించుకోవడానికి తాపత్రయపడ్డాడంటారు. ఐనా ఆ రోజు ముద్రగడ పద్మనాభాన్ని కలవకలేకపోయాడు చిరు. ఇప్పుడు తన వర్గం ఓట్లు ప్లస్ మసిబారిన తన ఇమేజ్ రెండూ పేరుపాలెంలోనూ తిరిగి కూడగట్టుకునే పనిలో పడ్డాడని కామెంట్ చేస్తున్నారు జనం.
After Telugu states division, congress has no life in Andhra Pradesh. But still chiranjeevi is fighting for Congress. Now he released 5cr funds to his home town.