చంద్రబాబుకు నీతి లేదంటున్న తలసాని

23 Feb 2016                           పార్టీల జంప్ జిలానీల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తాను పార్టీ మారిన సమయంలో ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఇప్పుడెందుకు భూమా అండ్ కోని చేర్చుకున్నారో చెప్పాలంటూ తెలంగాణ మంత్రి తలసాని మండిపడ్డారు. టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ తలసాని శ్రీనివాసయాదవ్ చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా కడిగిపారేశాడు. ఆయన చెప్పే నీతులన్నీ ఎదుటివారికే అన్నట్లు బిహేవ్ చేస్తారని. తాను మాత్రం అవి పాటించరని ఎద్దేవా చేశాడాయన.                       టిఆర్ఎస్ లో చేరిన టిడిపి ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని  అదేపనిగా డిమాండ్  చేసిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు, లేకేష్ ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు తలసాని. ఏ ఆశ చూపించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పార్టీ లో చేర్చుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే చంద్రబాబు నైచ్యానికి నిదర్శనమని చీదరించుకున్నారు తలసాని. ఏపీజనాలకు రాజధానిని సింగపూర్, మలేసియా లా కట్టిస్తున్నానంటూ చెప్తున్న చంద్రబాబు మాటలు జనం నమ్మొద్దని బాబు ఒకప్పటి సహచరుడు తలసాని కుండబద్దలు కొట్టారు.  నీతులు చెప్పే సత్యహరిశ్చంద్రుడు చంద్రబాబే అయితే, ఇప్పుడెందుకు దారి తప్పారంటూ ఎద్దేవా చేశారు తలసాని. ఐతే ఈ కప్పదాటు రాజకీయాల్లో నిన్నటిదాకా తలసానిని రాజీనామా చేయమన్న ఎర్రబెల్లి కూడా టిఆర్ఎస్ లోకి జంపవడంతో ఆయన సెటైర్లు అటు ఎర్రబెల్లికి కూడా లైట్ గా తగులుతున్నాయంటున్నారు.
Yesterday Bhuma Nagi Reddy and other four MLAs are joined in TDP. TRS minister Talasani Srinivas Yadav fired on Chandrababu about this incident.