బాబు జుట్టు కేసీఆర్ చేతిలో ఉందా

8 Feb 2016


                      కొన్ని పత్రికల రాత తీరు చూస్తే అలానే ఉంది. సిటీ ఎన్నికల్లో టిడిపి ఓటమి  ఎంత దారుణంగా ఉఁదో చూశాక కూడా కొన్ని పత్రికలు అదేదో చిన్న విషయం అన్నట్లు రాసేస్తున్నాయ్. ఉదాహరణకు ఆంధ్రులకు వెలుగు దివ్వెలు చూపించే ఓ పత్రిక ఓటుకు నోటు కేసులో ఇద్దరు సిఎంల మధ్య ఏదో ఒప్పందం కుదిరిందిన్నట్లు రాసుకొచ్చింది. ఆ కథనం ప్రకారం బాబు హైదరాబాద్ పై దృష్టి పెట్టకూడదట, దానికి బాబుగారు ఓకే చెప్పేసి సరిగా రాలేదని. ప్రచారంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదట. అందుకే జనం టిడిపిని పట్టించుకోలేదట ఇలా సాగింది ఆ కథనం.

                  అక్కడికేదో చంద్రబాబు సిటీని పట్టించుకుని ఉంటే ఈపాటికి ఫలితాలు తిరగబడి వందసీట్లు గెలిచేదన్నట్లుగా రాశారు. ఐతే ఇక్కడ ఆ అతి ఉత్సాహంతోనే ఓటుకు నోటు కేసులో అసలు బాబు కేసీఆర్ షరతుకు ఎందుకు తలొగ్గుతారనే ప్రశ్న ఎదురవుతుందని ఆ కథకులకు తెలీదా. అంటే కేసునుంచి తప్పించుకునేందుకు పార్టీని బాబు పణంగా పెట్టారని ఆయన గారి ఉద్దేశమా..అలానే ఉంది విషయం చూస్తే.
Total India was shocked with Vote for Note case. Now a paper wrote about Chandrababu, that he is now compromise with KCR, so he was not published in GHMC elections.