చంద్రబాబు అలా అన్నారా?

9 Feb 2016


                           ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు కామెంట్ చేశారా. రెండ్రోజుల నుంచి ఇదే ప్రచారం సోషల్ మీడియాలో తెగ సాగుతోంది. అటు కాంగ్రెస్, ఇటు వైఎస్సార్సీపీ ఇదే అదనుగా ఆయనపైకి వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ఠాఠ్ బాబు ఇలా ఎందుకంటాడని టిడిపి తమ్ముళ్లు అనే ఉంటాడని విపక్షాలు మండిపడుతున్నాయ్. ఏపిసిసి చీఫ్ రఘవీరారెడ్డి ఇక దొరికిందే సందనుకుని బాబుపైకి విమర్శల వర్షం కురిపించేస్తున్నారు. అసలు ఇంకో జన్మంటూ ఉంటే ఎస్సీగా పుడతానంటూ ఓవరాక్షన్ కూడా  చేసేశారు. చంద్రబాబునాయుడు ఖచ్చితంగా 24 గంటల్లోగా దళితులకు క్షమాపణ చెప్పాలంటూ డెడ్ లైన్ పెట్టాడు రఘువీరా, లేదంటే ఎస్సీకమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. 

                 ఐనా  ఎస్సీ కమిషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలిసి కూడా ఈ మాట అంటున్నారంటే రఘువీరా అమాయకత్వానికి జాలేస్తుంది. సీబీనాయుడికి కాపుల రిజర్వేషన్ల అంశంపై చిత్తశుధ్ది లేదంటూ విమర్శించిన రఘవీరా బిసి కమిషన్ కు సభ్యులు లేరంటూ ఆ సంస్థ కమిషనర్ లెవల్లో తపన పడ్డారు. కాపులు బీసీలకు నష్టం కలగకుండా బీసీల్లో చేర్చాలంటూ వితండ వాదన తెరపైకి తెచ్చారు. ఓసారి బీసీల్లో చేర్చిన తర్వాత మళ్లీ బిసిలకు నష్టం కలిగేదేంటో అర్తం కాదు. వీళ్ల ఉద్దేశం ఇప్పుడున్న బిసీ కేటగరి కులాలకు దెబ్బ తగలకుండా అయితే, అప్పుడు సెపరేట్ బీసీ కే నో, బీసీ ఎఫ్ అనో పెట్టమని సూటిగా డిమాండ్ చేయాలి. అంతేకానీ ఇలా డొంకతిరుగుడు మాటలెందుకు.
Chandrababu is hot topic in social media form last two days. In a meeting he commented on SCs and reservations. Opponent leader Raghuveera Reddy fired about it and going to complaint to SC commission.