కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడట

4 Feb 2016


        ఏపి సిఎం చంద్రబాబుపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు కాపు సంఘాలపైనా, కులస్థులపైనా ప్రేమ లేదని, మాటలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తారని ఎద్దేవా చేశారాయన. జిల్లాలను దాటొద్దని తమ నేతలను ఎందుకు శాసిస్తున్నారంటూ మండిపడ్డారాయన. అసలు కాపులకు రిజర్వేషన్ల అంశం ఇప్పటిది కాదని. 30ఏళ్లుగా ప్రతి పార్టీ ఇదే అంశం చెప్పిందని చెప్పారాయన. టిడిపి మాత్రమే గత ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ల అంశం పై హామీ ఇచ్చిందని గుర్తు చేసిన బొత్స ఆ పని చేయకుండా. బీసీ కులాలకు కాపులకు మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

           టిడిపి ఇక్కడ ఒకలా తెలంగాణలో మరోలా ప్రవర్తిస్తుందన్న బొత్స తెలంగాణలో ఎందుకు 23 కులాలను బీసీ కేటగరీనుంచి తప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఆర్ కృష్ణయ్య ఎందుకు ఈ అంశంపై పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.ఇదే టిడిపి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు బొత్స.
Andhra Pradesh Congress leader Botha Satyanarayan fired on Chandrababu. He is doing cast politics. About Kapu Reservation is not todays matter, it is till 30 years.