విజయవాడ వాసులకు అవమానం

19 Feb 2016


                 ఈ మధ్య మాట జారడం సిఎం చంద్రబాబుకు అలవాటుగా మారినట్లుందంటున్నారు. ఎందుకంటే ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ కామెంట్ చేసి కవర్ చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే పనిగా విజయవాడ వాసులపై విమర్శలు చేస్తున్నారు. కొద్దిగా ఆశ తగ్గించుకోవాలని, అద్దెలు తగ్గించుకోవాలని సూచిస్తున్న చంద్రబాబు ఆ మాట హైదరాబాద్ లో ఇళ్ల ఓనర్లుకు కూడా చెప్తే బావుంటుందని విజయవాడ వాసులు అంటున్నారు. సింగపూర్లో వ్యాపారం చేయడం కన్నా బెజవాడలో బిజినెస్ చేయడం కష్టంగా మారిందనడంలోని ఆంతర్యమేంటో ఆయనకే తెలియాలి. ఎందుకంటే బాబుకు అక్కడ వ్యాపారాలున్నాయంటే ఒప్పుకోరు కానీ ఇక్కడ ఎక్కువ కష్టం ఉందని మాత్రం అంటుంటారు. 

                      హైరదాబాద్ లో రెండు గదుల ఇరుకు ఇళ్లకు వేలకు వేలు వసూలు చేస్తున్న తెలంగాణవాసులకు కూడా ఇలానే సలహా ఇవ్వచ్చు కదాని. ఏపీవాసులు వాపోతున్నారు డిమాండ్ ఉన్నచోటే రేటు వసూలు చేస్తున్నారు. కానీ అదే పనిగా అద్దెలు ఎక్కువ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెనుమాక, గుంటూరు కి దగ్గర నల్లపాడులో తక్కువకు అద్దెలో వస్తాయి కదా. అక్కడకు పోయి అద్దెకు ఉండరు కానీ సిటీలో మాత్రం నగరశివార్లలో ఎంతమంది అద్దెజీవులుంటున్నారో తెలిసిందే కదా. అందుకే ఇకపైనా విజయవాడ వాసులను అవమానించే విధంగా ఆశపోతులనే అర్ధం వచ్చే విధంగా కామెంట్లు చేయవద్దని చంద్రబాబుకు సూచిస్తున్నారు.
What happen to Chandra Babu, recently he commented on SCs and now he fired on Vijayawada people about rents in Vijayawada.