కాపు కాస్తా

19 Feb 2016                      కాపు రిజర్వేషన్ల అంశంలో తెరపైకి వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. తన పోరాటం ఫలితం సంగతి ఎలా ఉన్నా ఎప్పుడు కాపులను బిసిల్లోకి చేర్చాలన్నా. ఆ పోరాటానికి పెద్ద గుర్తింపు రావడంలో ముద్రగడదే పై చేయి ఇంకెవరూ ఆ అంశాన్ని పట్టించుకోరో లేక అవసరం లేదనుకుంటారో కానీ దీక్షలు చేయడంలో ఆయనే ముందుంటారు. ఇప్పుడు తుని సభకు వచ్చిన వారిపై కేసులు పెట్టడంపైనా మండిపడుతున్నారాయన. ఏపి డిజిపికి మిగిలినవారిపై కేసులు ఎత్తేసి అన్ని కేసులు తనపై పెట్టమంటూ సవాల్ విసురుతున్నారు. ఏ జైలుకైనా వస్తానని బెయిల్ కూడా వద్దంటూ విషయాన్ని చల్లార్చకుండా ఉండే  ప్రయత్నం చేస్తున్నారు. డిజిపి కోరాలే కాని ఎంతమంది ఎక్కడెక్కడ నుంచి సభకు వచ్చినది చెప్తానంటూ విరుచుకుపడ్డారు.

                     ఆమాయకులపై కేసులు ఉండబోవన్న ప్రభుత్వ హామీని పోలీసులు అమలు చేయాలని ఆయన కోరారు. ఏ జైలుకు రమ్మంటే ఆ జైలుకు వస్తానని, బైయిల్‌ కోసం ప్రయత్నం చేయనని లేఖలో స్పష్టం చేశారు. జైల్లో పెట్టిన తర్వాత కూడా బెయిల్‌ కోసం ప్రయత్నం చేయబోనని ఆయన అన్నారు. ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే నాతో పాటు అందరూ జైలుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని ముద్రగడ చెప్పడం సెన్సేషన్ కలిగిస్తుంది.
Mudragada Padmanabham is the Kapu Porata samithi Leader. Recently he did fasting for Kapu reservation. TDP government filed cases on Thuni incident.