అవుతాడా సిఎం

25 Feb 2016                     పదేళ్లు ఎదురు చూశాడు, ఇప్పుడు అవకాశం వచ్చింది దానికి తోడు జాతీయస్థాయిలో కూడా బిజెపి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తోంది, ఇక కెప్టెన్ విజయకాంత్ ఔతాడా సిఎం అంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయ్. బిజెపి సూపర్ స్టార్ రజనీని దువ్వి భంగపడే కంటే, ఆల్రెడీ రంగంలో ఉండి పేరు తెచ్చుకున్న విజయకాంత్ కి మద్దతిస్తే ఇద్దరికీ లాభం దక్కుతుందనే వ్యూహంలో ఉండటం, విజయ్ కాంత్ టార్గెట్ కు దగ్గర చేస్తోంది. ఐతే విజయ్ కాంత్ మాత్రం కింగైనా, కింగ్ మేకరైనా అది జనం తేల్చుతారని తాను మాత్రం ఒంటరిగానే బరిలో దిగే ఆలోచనలో  ఉన్నట్లు తెలుస్తోంది. పొరుగురాష్ట్రం ఏపీలో మెగాస్టార్ చిరంజీవి బరిలో దిగి పార్టీని గంగలో కలిపినా తానుమాత్రం జనాన్నే నమ్ముకుని పార్టీని నడిపిన ధీరుడు విజయ్ కాంత్. ఐతే బిజెపి కాంగ్రెస్ అటు అన్నాడిఎంకే కానీ, డిఎంకేతో కానీ అంటకాగుతుండటంతో డిఎండీకే ధీరుడికి మద్దతు దొరకలేదు. కానీ ఇప్పుడు బిజెపి అటు జయలలితతో పొత్తుకు సై అంటూనే, మాస్ సూపర్ స్టార్ కి వల వేస్తుండటం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.  

                       అటు రజనీకాంత్ ఎన్నికలకు దూరంగా ఉండటం, కరుణానిధి వృద్దాప్యం ఇప్పుడు కొత్త సిఎం ను చూసే అవకాశాన్ని అరవతంబిలు కలిగిస్తారా అన్నదే ఇప్పుడు డౌట్. ఆ ఛాన్స్ అంటూ వస్తే అది మాస్ ఇమేజ్, క్రౌడ్ పుల్లర్ అయిన విజయ్ కాంత్ కే సాధ్యమవ్వాలన్నది పార్టీల ఆలోచన. అందుకే సింగిల్ గా కాకుండా, కలిసి నడిస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చనేది తృతీయ కూటమి ఆలోచన. ఇప్పటిదాకా డిఎంకే, అన్నాడిఎంకే మాత్రమే అధికారం చేపట్టగా. ఈసారి డిఎండీకే హవా ప్రారంభం కావాలని కెప్టెన్ ఫ్యాన్స్ కూడా ఆరాటపడుతున్నారు. ఐతే మనోడి టెంపర్, తెంపరితనం ఏదీ దాచుకోని ఆత్రం మైనస్ పాయింట్లుగా చెప్పాలి, చూద్దాం ఏం జరుగనుందో.
All Parties in Tamilnadu are waiting for Rajanikanth. But he did not gave green singnal to any party. So now all parties are concentrated on Vijayakanth.