ఓ సిఎంను అలా అనొచ్చా..!

9 Feb 2016


                      ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇంత మాట ఇంకెవరైనా అని ఉంటేచంద్రబాబు గుడ్లురిమి చూసేవారు, ఛానల్ ని అయితే బ్యాన్ చేశేవారు. కానీ అన్నది నారాయణ సిపిఐ నారాయణ ఒకప్పటి తన మిత్రుడు సొంత జిల్లా వాసే కావడంతో బాబు లైట్ తీస్కున్నట్లుంది. కాపు రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు  ఏ గాడిదలు కాస్తున్నాడు ఈ రెండేళ్లు అని నారాయణ ఎద్దేవా చేయడం దారుణం అన్పించకమానదు..

                    చెన్నైలో ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు నారాయణ, కాపు సంఘాలు తమ రిజర్వేషన్ల కోసం చేపట్టిన కార్యక్రమాలు, ఆ తర్వాత జరిగిన హింసాకాండకు బాధ్యత వహించాల్సింది టిడిపినే అని కుండబద్దలు కొట్టారు సిపిఐ నారాయణ. అంతటితో ఊరుకోకుండా ముద్రగడ తన దీక్షలో భార్యాబిడ్డలను కూర్చోబెట్టడం గృహహింసకిందకు వస్తుందంటూ కామెడీ చేశారు. రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా చంద్రబాబును పవన్ కల్యాణ్ శిఖండిలా కాపాడుతున్నారంటూ అర్థం పర్థం లేని కామెంట్ ఒకటి చేసారు నారాయణ దీని అర్ధం తెలిసే చేశారో లేక ఫ్లో లో అన్నారో కానీ చంద్రబాబును కాపాడాల్సిన అవసరం పవన్ కల్యాణ్ కి ఏంటో కూడా నారాయణ చెప్పాలని పాఠకులు డిమాండ్ చేస్తున్నారు.
CPI leader Narayana fired on AP CM Chandrababu. Narayana fired on CM about Kapau, what he is doing from last two years.