ఇక అంతేనా

4 Feb 2016


              కాపులకు రిజర్వేషన్ల అంశంపై  టిడిపి ప్రభుత్వం తమ హామీకి కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఐతే ఈ అంశంపై గత ఇరవైఏళ్లలో ఎవరూ పట్టించుకోకపోయినా తామే ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారాయన. కేబినెట్ సబ్ కమిటీ ఒకటి కాపుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు నియమిస్తున్నట్లు మంత్రివర్గసమావేశంలో చెప్పారు. ఐతే ఇప్పటికే ఏపీలో తెగ సబ్ కమిటీలు ఏర్పాటైన సందర్భంలో ఈ కమిటీ కూడా వాటిలో ఒకటిగా మారుతుందేమో అని  అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. మంత్రవర్గసమావేశంలో పట్టిసీమను మార్చికల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు..మరి పోయినేడాది ఆగస్ట్ కల్లా పట్టిసీమ పూర్తి చేశామని చెప్పారు .
                 మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పదిశాతం బోనస్ కూడా ప్రకటించారు..అంటే అప్పట్లో అబద్దం ఆడినట్లనుకోవాలా. కేబినెట్ భేటీలో బాబు చెప్పిన అంశం వ్యవసాయానికి ఎయిర్ గన్ల వాడకం ఒకటి..దాదాపు 1500ఎయిర్ గన్లు ఇందుకు రెడీ చేశామంటున్నారు. ఇదేదో మేఘమధనం కార్యక్రమాన్ని గుర్తు చేస్తుందని రైతులు గుసగుసలాడుతున్నారు
CM Chandrababu promised about Kapu reservation, but now playing with reservation. Chandrababu said that Patti Seema project will be ready for the year end of 2015. But till now no motors were fixed there.