బాలకృష్ణకు ఝలక్

4 Feb 2016


                 పొట్టోడి జిత్తులు అన్నీ ఇన్ని కావంటారు. కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఇప్పుడదే పని చేశారు. ఆయన లేవనెత్తిన ప్రశ్నలో లాజిక్ ఉండటంతో టిడిపి నేతలకు వెలక్కాయపడ్డట్లే అయింది. హిందూపురం శాసససభ్యుడైన బాలకృష్ణ సిటీ ఎన్నికల్లో ఎలా ఓటేశారని అడిగాడాయన. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కు లేఖ కూడా రాశాడట. ఇదే నిజమైతే మరీ డీప్ గా పోతే ఎమ్మెల్యే పదవి ఊడినా ఆశ్చర్యపోనక్కర్లేదు..ఐతే వీళ్లంతా దొందూ దొందూ కాబట్టి విషయం అంత దూరం పోదనుకోండి.
  
                   పొన్నం లాజిక్ ప్రకారం హిందూపురంలో ఓటు హక్కు ఉన్న బాలకృష్ణకు హైదరాబాద్ లో ఓటు హక్కు ఉండటానికి వీల్లేదు. ఓ వేళ ఉంటే రెండు రాష్ట్రాల్లో ఓటుహక్కు ఉన్నందుకు ఆయన సభ్యత్వం రద్దు కావచ్చు. లేదంటే ఒక ఓటు హక్కును వదులుకోవాల్సి రావచ్చు. అందులోనూ సిటీలో ఎన్నికల సమయంలో బూతులు వాడిన బాలయ్య ఇప్పుడు అనవసరంగా హంగామా ఎందుకు చేసాన్రా బాబూ అని జుట్టు పీక్కుని ఉంటుండొచ్చు. సారీ మనోడికి బాల్డ్ హెడ్ కాబట్టి విగ్ పీక్కుని ఉండొచ్చు. 
Big shock to hero, Hindupuram MLA Bala Krishna. Recently in GHMC election he voted. But he has a vote in Hindupuram also. It is a big crime, he may loss his MLA post.