భూమా హాట్ కామెంట్స్

23 Feb 2016                      "చంద్రబాబునాయుడికి అస్సలు కృతజ్ఞత లేదు, నేతలను గౌరవించడం తెలీదు, ఎవరినీ పట్టించుకోరు. ఎప్పుడూ ఏ లీడర్లని ఎలా వాడుకోవాలనే తపనే తప్ప వారికి మంచి చేసే ఉద్దేశమే లేదు. "ఈ డైలాగులు ఎవరివో కావు. ఇప్పుడు టిడిపిలోకి జంపైన మాజీ ఎంపి ప్రస్తుత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డివి. ఇంత ఘాటుగా మాట్లాడిన భూమా ఇప్పుడు భలేగా పచ్చచొక్కాల్లో అమరిపోయారు. రేపట్నుంచి టిడిపి ఆఫీస్ లో కూర్చుని వైసీపీపై విమర్శలు చేస్తారు. ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ పదవులు సంపాదించుకోవడం, అవి అనుభవించేసిన తర్వాత పార్టీలు మారడం ఇది కామన్ గా మారిపోయిన పాలిటిక్స్ లో జనం కూడా ఈ జంప్ జిలానీలకే ఎలా చోటిస్తారో అని ఆశ్చర్యపోకతప్పదు. కానీ అసలు ఓటర్లలో సగంమంది పోలింగ్ సెంటర్లకే రానప్పుడు, వచ్చిన వారిలో 50శాతం ఓట్లు తెచ్చుకున్నప్పుడు ఇక వాళ్లు కాకపోతే ఎవరు గెలుస్తారుకోవాల్సిందే. 

               టిడిపి,కాంగ్రెస్,టిఆర్ఎస్,వైఎస్సార్సీపీ ఇలా పార్టీలు వేరు. అందులో నేతలే అటూ ఇటూ జంపవుతున్నంత కాలం పరిస్థితి ఇలానే ఉంటుంది. ఐతే తాను టిడిపిలో ఉన్నప్పుడు అవమానం జరిగితే కంటనీరు పెట్టినా చంద్రబాబు పట్టించుకోలేదని వాపోయిన భూమానాగిరెడ్డి మళ్లి అదే పార్టీలోకి ఎలా వెళ్లగలిగాడో  ఆయనకే తెలియాలి. ఇంత రభస చేసిన ఈ నేత మళ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారడని..పిఆర్పీలో జేరినట్లు జనసేనలో చేరడని గ్యారంటీ ఏం లేదు. ఐతే ఎప్పట్నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్లకు కాకుండా జంపింగ్ జపాంగ్ గాళ్లకే పదవులు దక్కుతున్నప్పుడు మాత్రం ఆయా పార్టీనేతలు ఆక్రోశించకతప్పదు.
Yesterday YSRCP MLA Bhuma Nagireddy joined in TDP with four other MLAs. When he was in YSRCP he fired on Chandrababu. Now how was he joined in TDP.