గతం మరిచిన ఇల్లలికిన ఈగ

25 Feb 2016                 ఇల్లలికిన ఈగ అలా.. తన పేరేదో తానే మర్చిపోయిందట. అలానే ఉంది ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీరు, తల్లి శోభానాగిరెడ్డి చనిపోతే వైఎస్సార్సీపీ అధినేత దయతో టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా ఎంపికైన ఆమె. ఇప్పుడు మాట్లాడిన మాటలు నిశితంగా పరిశీలిస్తే ఆమె అవివేకాన్నే సూచించకమానదు. ఆళ్లగడ్డలో గత ఇరవైఏళ్లుగా అభివృధ్ది జరగలేదని, అందుకే పార్టీ మారామని ఆమె, ఆమె తండ్రి చెప్పుకురావడం విపరీతమే. ఎందుకంటే ఆ ఇరవైఏళ్లూ వాళ్ల కుటుంబసభ్యులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే తల్లి శోభానాగిరెడ్డి, తండ్రి నాగిరెడ్డి, పెదనాయన శేఖర్ రెడ్డి వీళ్లంతా డెవలప్ మెంట్ చేయలేక చేతులెత్తేస్తే. ఇప్పుడీ పిల్లకాకి టిడిపి అండతో అభివృధ్ది చేస్తుందని అనుకోవాలా అని అక్కడి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.


                    పార్టీ మారడం సిగ్గు మాలిన పని, దానికి ఓపెన్ గా చెప్పుకోవాల్సినది అధికారపార్టీతో ఉంటే కొన్ని అదనపు పనులు జరుగుతాయి, కేటాయింపులు ఎక్కువ ఉంటాయి. అలా అనే ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పుకోవాలి కానీ. ఏదో గతంలో అభివృధ్ది చేయలేదు, ఇప్పుడు పార్టీ జంప్ కొట్టి సింగపూర్ లా ఆళ్లగడ్డను చేస్తామనడం అసలు నమ్మేపనిలా ఉందా. ఆ స్టాక్ డైలాగ్ వేయడంలో అక్కడ తన తల్లిదండ్రులే ఎమ్మెల్యేలుగా ఉన్నారనే మాట మర్చిపోవడమే అఖిలప్రియకు పెద్ద రివర్స్ పంచ్ పడ్డట్లైంది. ఇది రేపో ఎల్లుండో జరిగే అసెంబ్లీ సెషన్స్ లో ఖచ్చితంగా సభలో ఎదుర్కుని తీరుతుంది.
YSRCP MLA Bhuma Akhila Priya recently joined in TDP. In a press meet her comment are very funny. She told that since last twenty years Allagada was not devloped.