కామిక్ బాహుబలి

4 Feb 2016


                 బాహుబలి సినిమా కథ, కథనం పై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం అది ఇండియన్ సినిమాకే నంబర్ వన్ అని అందరూ ఒప్పుకున్నారు. ప్రపంచస్థాయి వసూళ్లతో అందరి దృష్టీ తెలుగు సినిమాపై పడేలా చేసింది బాహుబలి. అలాంటి బాహుబలి మేనియా ఇప్పుడు చిన్నారులకు ఎప్పటికి మిగిలిపోయేలా ప్రయత్నాలు జరుగుతున్నాయ్. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియా జాయింట్ గా బాహుబలి ది లాస్ట్ లెజండ్ పేరుతో కామిక్ షో తయారు చేస్తున్నారు. నవలలు, యానిమేషన్ లో గేమ్స్ కూడా సిధ్దం చేస్తున్నారు..దీంతో మరోసారి ప్రొడ్యూసర్ కు కనకవర్షం కురిపిస్తుందని అంచనావేస్తున్నారు. 
               
                        ఒకరకంగా బాహుబలి అమ్మినరేట్లకు నిర్మాతకంటే బయ్యర్లు..డిస్ట్రిబ్యూటర్లకే ఎక్కువ మిగిలిందనే విమర్శ ఉంది. ఇప్పుడీ కొత్త ప్రయత్నంతో అసలు లాభం నిర్మాతలకే దక్కుతుందని భావిస్తున్నారు. బాహుబలి ది లాస్ట్ లెజెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ డైరక్టర్ రాజమౌళి నిర్మాత శోభుతో కలిసి విడుదల చేశారు. తొందర్లోనే ఈ సిడీలు, డివీడీలు మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది.
Bahubali movie created sensational hit in all over India. It collects record level money. Now to keep it permanently Babhubali, they doing a comics, and Games.