ఆడేట్రా బుజ్జీ..అంత ఓవరాక్షన్

25 Feb 2016                   
                    ...బడేటి బుజ్జి అనే టిడిపి ఎమ్మెల్యే ఓవరాక్షన్ ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు కానీ, చినబాబు లోకేష్ కానీ నోరేసుకుని పడిపోయే అచ్చెనాయుడు కానీ ఎవరూ చేయనంత డ్రామా సదరు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రదర్శించడం రాజకీయవర్గాల్లో చర్చకు  దారి తీస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకున్న అంశం వివాదం రేపుతుంటే ప్రతిపక్షనేత జగన్ చేసిన కామెంట్లను ఓ విలేఖరి ప్రస్తావించడమే ఆయనగారి బూతుల పురాణానికి నాందిగా మారింది.

                    గతంలో తమ సమస్యలను ప్రస్తావించడానికి వచ్చిన రైతులపైకి అంతఎత్తున లేచిన సదరు ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో టచ్ లో ఉన్నారనే కామెంట్లపై ఎందుకింత అతిగా స్పందించారనేది తెలియరావడం లేదు. అప్పట్లో పయ్యావుల కేశవ్ కూడా ఇలానే పార్టీ జంపవుతాడనే న్యూస్ వస్తే కన్నీరెట్టుకున్నాడు. ఇంత ఉలుకేంటే తెలియడం లేదు. పైగా జగన్ వెంట మా వాళ్లు  ఒక్కళ్లైనా వెళ్లారా అంటూ సవాళ్లు విసరడం ఒకటి. అసలు పార్టీలు మారడమే వ్యభిచారంతో పోల్చుతుంటే మీవాళ్లను మేం లాక్కున్నాం మీరు మావాళ్లను లాక్కోగలరా అంటూ సవాళ్లు ఛాలెంజ్ లు విసరడం చూస్తుంటే టిడిపి రాజకీయాలంటే ఇలానే ఉంటాయా అన్పించకమానదు. ఓ వేళ వైఎస్సార్సీపీలోకి ఎమ్మెల్యేలు వస్తే వాళ్ల చేత రాజీనామాలు చేయించి పార్టీలోకి తీసుకుంటా అని జగన్ చెప్పడం వీరికి ఎందుకు విన్పించలేదు. అంటే కన్వీనెంట్ గా దాన్ని పక్కనబెట్టేసి జంపింగ్ జపాంగ్ లను ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఇప్పుడంత అర్జెంట్ గా  ఎందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారన్నది అర్ధం కావడంలేదు. నిజంగా టిడిపినుంచి ఎమ్మెల్యేలు జారిపోతారనే భయమే ఇలా చేస్తుందా అన్నదే ఓ చిన్న ప్రశ్న కానీ రేపు అదే అతి పెద్ద ప్రశ్నగా మారబోతోంది.
TDP MLA Badeti Bujji did over action in press meet. For a reporter question about attracing MLAs into TDP he was fired on a reporter.