బాబు సైకిల్ కి బుల్లెట్ స్పీడ్

18 Feb 2016


                       ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటిదాకా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రతీ చోటా కామన్ గా కొన్ని డైలాగులుండేట్లుగా జాగ్రత్త పడుతున్నట్లున్నారు. ' విభజన శాస్త్రీయంగా జరగలేదు' రాష్ట్రం ఆర్ధికంగా కష్టాల్లో ఉంది, ఎన్ని కష్టాలున్న అదరను, బుల్లెట్ లా దూసుకుపోతా' అంటూ రొటీన్ డైలాగులు వేస్తుంటారాయన. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కొంతమంది యూత్ చేరిన నేపధ్యంలో ఈ స్క్రిప్ట్ పదే పదే బాబు నోటి వెంట వస్తున్నట్లు టాక్. 

                తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో భారీగా అభివృధ్ది పనులుకు శ్రీకారం చుట్టారని చెప్తూ, ఏదెలా ఉన్నా భయపడనంటూ. బుల్లెట్ లా దూసుకుపోతానని కామెంట్ చేశారు. ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నట్లు చెప్పుకునే చంద్రబాబుకు భోగాపురం ఎయిర్ పోర్ట్, రాజధాని ప్రాంతంలో రైతుల నిరసన. భీమవరంలో ఆక్వా పార్క్ పై వెనుకంజ లాంటి పరిణామాలు సహజంగానే షాక్ కలిగిస్తున్నాయనే చెప్పాలి. ఐనా అందరి ఆశీస్సులు ఆయనకు ఉన్నప్పుడు  ఇక ప్రతిపక్షాలు అభివృధ్దిని అడ్డుకుంటున్నాయని అనడంలో అర్దం లేదని విశ్లేషణలొస్తున్నాయ్. ఏ ఊరికి వెళ్లినా కేపిటల్ సిటీకి లింక్ పెడుతూ భీకరమైన అభివృద్ది సాధిస్తుందని చెప్పడంలో చంద్రబాబును మించినవారు లేరంటారు, చిలకలూరిపేటలో ఆయన ప్రసంగం చూస్తే అదే కరెక్టని ఒప్పుకోకతప్పదు.
In all latest meetings Chandrababu telling about state division, and its budgets. Recently he talked in Gunturu district Chilakaluri Pet meeting, i will go with bullet speed.