కృష్ణవంశీ సోపేసిన సంగతి అనుష్కకి తెలుసట

10 Feb 2016


                         సినిమారంగం హిపోక్రసీ రెండూ కలగలసి ఉంటాయ్. ఏ మాట ఎప్పుడు ఎందుకు ఎలా చెప్తారో, ఎందుకు మార్చుతారో ఎవరూ చెప్పలేరు. ఐతే  ఇది సినిమా ఫీల్డ్ కి మాత్రమే పరిమితం కాదు కానీ. మనకి తెలిసిన సెలబ్రెటీ రంగాలు ఒకటి ఫిల్మ్ ఇఁడస్ట్రీ, ఇంకోటి పాలిటిక్స్. ఈ రెండే జనానికి బాగా కనెక్ట్ అవుతాయ్ కాబట్టి వీళ్లేం చేసినా బాగా చొచ్చుకుపోతుంది. విషయం ఏంటంటే హీరోయిన్ అనుష్క అందం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలానే ఆమె అభినయం గురించి ప్రస్తావనా అక్కర్లేదు వరసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఇరగదీసిన అనుష్కతో డైరక్టర్ కృష్ణవంశీ ఓ సినిమా తీస్తున్నట్లు ఫీలర్లు వదిలాడు. దానిపై అనుష్క ఎక్కడా ఓపెనవలేదు. 

                          ఐతే కృష్ణవంశీ తన సినిమాకు పబ్లిసిటీ మాత్రం తెచ్చేసుకున్నాడు. ఇప్పుడా ప్లేస్ లో సమంతని తీసుకున్నాడని టాక్. ఇంతా చేసి ఆ సినిమా ఓపెన్ అయ్యేవరకూ ఏదీ కన్పామ్ కాకపోయినా. ఇప్పుడీ ఛేంజ్ పై అనుష్క ఎవరెలాంటి వారో, ఎవరెందుకు సోప్ వేస్తున్నారో తనకి తెలుసని కామెంట్ చేసింది. ఇది కృష్ణవంశీని దృష్టిలో పెట్టుకునే చేసిందంటున్నారు. తన సినిమాకి అనుష్క తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరని చెప్పిన సదరు దర్శకుడు ఇప్పుడు ఫ్రెష్ ఫేస్ అంటూ పాతిక సినిమాల సమంతను తీసుకోవడంపైనే ఇలా డైలాగేసిందని అంటున్నారు. ఇవన్నీ చాలా చూశానని అందుకే ఈ స్టేజ్ లో ఉన్నానని స్వీటీ ఇండైరక్ట్ కామెంట్స్ విసిరిందట. దీంతో మనోడికి గట్టి షాకే తగిలిందనుకోవాలి. ఎందుకంటే ఖడ్గం టైమ్ లోనూ ఓ హీరోపై సెటైర్లేసి ఆనక గోవిందుడు అందరివాడేలే ఆడియో ఫంక్షన్లో దానికి సారీ చెప్పుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది.
Toolywood hot heroin Anuska commented on Krishna Vamsi. Recently Krishna Vamsi announced about a movie with Anushka, but later he selected Samantha for this project.