నోటి జిలోడు

22 Feb 2016                             సమాజ్ వాదీ పార్టీ నేత, యూపీూ మంత్రి అజంఖాన్ కి కొండంత అహంతో పాటు, ఏనుగంత బలుపు కూడా ఉందంటారు. ఎప్పటికప్పుడు నోటికి పని చెప్తూ, వార్తల్లో చిరాకు  పుట్టించే అజంఖాన్ ఇప్పుడు మరోసారి తన నోటి తీట తీర్చుకున్నాడు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ బిల్డింగులు కూల్చేయాలని చెప్తున్నాడీ మహానుభావుడు. రీజనేంటంటే ఇవి రెండూ బ్రిటీష్ వారి ఆధిపత్యానికి బానిసత్వానికి ప్రతీకలట.

                             రాంపూర్‌లోని డిగ్రీ కళాశాల సెమినార్లో ఆజంఖాన మాట్లాడుతూ   బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టిన ఈ బిల్డింగులు మన బానిసత్వానికి నిదర్శనాలట, ముందు తాజ్ మహల్, తరువాత రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ అన్నింటినీ పడేసి కట్టుకోవాలట. ఇంట్లో ఎలుక దూరితే ఇల్లు తగలబెట్టమన్నట్లుంది అజంఖాన్ వైఖరి. ఇదే ఇంకో హిందూ ఎంపి అనుంటే ఈపాటికి జనం రాళ్లతో కొట్టేవాళ్లేమో. తాజ్ మహల్ ఓ శివాలయం అంటూ నెట్ లో వీడియోలు చక్కర్లు కొట్టడం తెలిసిందే. ఐతే పార్లమెంట్ బిల్డింగ్, రాష్ట్రపతి భవన్ ఇలా ఇవన్నీ అప్పటివారి కట్టి ఉంటే ఉండొచ్చు కానీ, ఇలా కూల్చుకుంటే పోతే బానిసరాజుల చారిత్రక కట్టడాలు చాలా ఉంటాయ్ మరి వాటి మాటేంటి అజంజీ..!
Samajwadi Party Leader Anjan Khan is always a hot topic in news. Recently in college meetin he commented about Taj Mahal, Parlment, and Rastra Pathi Bhavan. They all are the memories off Briteshers. so he want destroy all of them.