పూరిగుడిసె కు 18లక్షల బిల్లు ఇదీ బాబు పాలన

25 Feb 2016                       పేదవాడి సంక్షేమమే మా లక్ష్యం ఇదీ టిడిపి స్లోగన్ కానీ, మంత్రం కానీ నిజం కూడా అలానే ఉందా, పాలన అలానే సాగుతుందా, అంటే ఒక్క ఉదాహరణ చూస్తే అర్ధమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, పాలన జరుగుతున్న తీరు కావచ్చు. ఓ పూరి గుడిసెలో ఒక్క బల్బు ఉంటే ఉచిత కరెంట్ ఇచ్చేవారు వైఎస్ హయాంలో ఆ తర్వాత ఓ ఫ్యాన్ కి కూడా కరెంట్ ఖర్చు లేకుండా ఉండేది. ఐతే ఇప్పుడు చంద్రబాబుగారు పుణ్యమా అని ఎల్ ఈడీ బల్బులు ఉచితంగా పంపిణీ జరగడంతో. బిల్లులు ఆదా అవుతాయని అనుకుంటే  పొరబాటు
విశాఖ  జిల్లా దొండపూడి అనే ఊల్లో దేవుళ్లమ్మకి ఇంట్లో రెండు బల్బులు ఫ్యాన్ ఉన్నాయ్. నెలబిల్లు మహా వస్తే ఎప్పుడైనా 120 రూపాయలు వచ్చేదట. ఇప్పుడు ఏకంగా 18 లక్షల బిల్లొచ్చిందట, దీంతో లబోదిబోమంటూ దేవుళ్లమ్మ కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. 
                     పేదరాలు కదా ఎందుకు పట్టించుకుంటారు మండల కేంద్రం రావికమతానికి వెళ్లి మార్చుకోమన్నారే కానీ అదంత తేలికగా అయ్యే పని కాదు కదా. ఓ అరడజనుసార్లు తిప్పుకున్న తర్వాత బిల్లింగ్ యూనిట్లలో తేడా వచ్చిందని ఉన్నతాధికారులు చెప్పారట. ఇలా వందరూపాయలు కూడా బిల్లుల రాని వారికి ఇప్పుడు లక్షల్లో బిల్లు రావడం బాబు పాలన తీరుకు నిదర్శనం అనుకోవాలా, లేక అధికారుల నిర్లక్ష్యమా. ఐతే తాను నిద్రపోను, పోనివ్వను అని చంద్రబాబు ఎప్పుడూ చెప్తుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఖాతాలోకే వేయాలంటున్నారు ప్రతిపక్షనేతలు.
Chandra Babu always saying, i will never sleep and dont alow to sleep officer. In Vizag district an old women got 18 lack electricity bill for her hut.