తెలుగు వెలిగేది ఎలా?

23 Jan 2016          తెలుగు భాష..మాతృభాష..ఇది వెలిగిపోవాలని ప్రభుత్వంలో ఎవరున్నా లెక్చర్లు దంచుతారు..ఐతే వాస్తవంలో మాత్రం వారి వైఖరి విమర్శలకు దారి తీస్తోంది..తెలుగు ప్రాచుర్యానికి స్థాపించిన తెలుగుయూనివర్సిటీ విభజన తర్వాత తెలంగాణకు వెళ్లిపోయింది..తెలంగాణ పెద్దలు మాత్రం మాది తెలుగు కాదు తెలంగాణ అన్న పధ్దతిలోనే వ్యవహరిస్తుంటారు..ఈ నేపధ్యంలో పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిబ్బందికి కష్టాలు ప్రారంభమయ్యాయ్. సిబ్బందికి ఆర్నెల్లనుంచి జీతాలు ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది..ఇదే అంశాన్ని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రస్తావిస్తూ..ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు
          తెలుగుయూనివర్సిటీతో పాటు అంబేద్కర్ యూనివర్సిటీ సిబ్బందికి 15 రోజుల్లో జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదని ..ఇది కోర్టు ధిక్కారం అవుతుందని హెచ్చరించారాయన. 

Our leaders are saying lecturers about Telugu, and protecting telugu. No salary were giving to Telugu university employees from last six months.