ఈకలు పీకుతున్న రేవంత్ రెడ్డి

14 Jan 2016


              తెంలగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పై మీట్ ది ప్రెస్ లో టిడిపి నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయ్..అసలు సుప్రీంకోర్టు సెటిలర్ అనే పదాన్నే నిషేధిస్తే..పొలిటికల్ లీడర్లు మాత్రం దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు.. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ టిడిపిలో ప్రకంపనలు సృష్టిస్తుంటే..ఏకవీరలా రేవంత్ రెడ్డి మాత్రం ఆయన ఛాలెంజ్ ను స్వీకరించానంటున్నాడు.. రేవంత్ చెప్తున్నదాని ప్రకారం..కేటీఆర్ హైదరాబాద్ లో స్థిరపడినవారంతా..అంటే ఇతర తెలంగాణ జిల్లాల్లో పుట్టినవారంతా సెటిలర్లే అన్నారట..కోదండరామ్, గద్దర్, చుక్కారామయ్యలాంటి వారిని ఉద్దేశించే కేటీఆర్ అలా అన్నట్లు ఆపాదించారు రేవంత్ రెడ్డి..గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లు ఖచ్చితంగా కీలకం..నో డౌట్..ఐతే వీరి ఓట్లతోనే గట్టెక్కడం ఎవరికీ సాధ్యం కాదు..ఐతే మెజార్టీ ఓట్లు సీమాంధ్రులవి ఉన్నచోట వారిని దువ్వడానికే ఇప్పుడు టిఆర్ఎస్ ట్రై చేస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే..ఆ మాటకి వస్తే టి.టిడిపి నేతలు ఈ విషయంలో అందరికంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివారు కూడా..గతంలో తాము మొహం మీద ఉమ్మేసినా పోనే పోరంటూ సీమాంధ్రులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఘనత వారిదే..అదంతా మర్చిపోయి..ఇప్పుడు సెటిలర్లన్నారు..తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వాపోవడం ప్రస్తుత రాజకీయదిగజారుడికి తాజా నిదర్శనం.

Recently Telangana minister KTR commented on settlers in Telangana. But Revanth Reddy is not talking about it. In Hyderabad settlers vote are very important.