అలాగైతే పాలిటిక్స్ గుడ్ బై

23 Jan 2016


           కేటీఆర్ వందసీట్ల సవాల్ లో నేనూ ఉన్నానంటూ తయారయ్యారు టిఎస్ కాంగ్రెస్  ఎమ్మెల్సీ..మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ.. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ వందసీట్లు గెలిస్తే తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తానంటూ బెదిరించేశారు..అసలు టిఆర్ఎస్ దెబ్బకు పార్టీలు ఖాళీ అవుతుంటే..ఇప్పుడు పాలిటిక్స్ కు గుడ్ బై చెప్తాననడం నవ్వుల పాలయ్యేలా చేస్తోంది..ఏపీలో సర్వనాశనమైన కాంగ్రెస్..తెలంగాణలో ఏదోలా నెట్టుకొస్తోంది..నాయకులు ఎక్కువ..కేడర్ తక్కువలా కన్పించే కాంగ్రెస్ ఇప్పుడు కేటీఆర్ సవాల్ కు తానూ రెస్పాండైతే..కాస్త జనం మాట్లాడుకుంటారేమో అనుకున్నారేమో. షబ్బీర్ అలీ సవాళ్లు విసిరారు.. రేపొద్దున పొరపాటున టిఆర్ఎస్ సెంచరీ కొడితే పడాల్సిన వికెట్లు చాలా ఉన్నాయ్. 
          ఐతే పాలిటిక్స్ లో ఇలాంటి సవాళ్లు..సన్యాసాలు మామూలే.. అంత తేలిగ్గా రాజకీయాలకు దూరమయ్యే మాటే నిజమైతే..పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలవలేని వాళ్లు మళ్లీ దొంగచాటున ఎమ్మెల్సీలుగా ఎందుకు ఎన్నికవ్వాలి..పదవుల కోసం ఎందుకు తాపత్రయపడాలి అని జనం ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు..పైగా రాష్ట్రంలో పోలీసులు టిఆర్ఎస్ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారు..ధనాన్ని వెదజల్లుతుందంటూ స్టాక్ డైలాగులేస్తున్నారు షబ్బీర్ అలీలాంటి నేతలు..

In GHMC Elections TRS leader gave open challenge to all party that we will win 100 seats in this elections. For this challenge congress leader gave counter, if TRS win 100 seats i will reign for party, present it is the biggest comedy.