నాగ్ సినిమాలకు రీషూట్ కామనా..?

14 Jan 2016


         తెలుగు సినిమారంగంలో ఈ మధ్య బాగా విన్పిస్తున్న మాట రీషూట్..ఈ పదం చాలామంది ఏదో వినకూడని మాటలా భావిస్తుంటారు..ఐతే యువసామ్రాట్( ఇప్పటికి 55ఏళ్లు ఈయనకు ఇంకా ఈ మాట అనొచ్చో లేదో తెలీదు..కానీ కామన్ గా అనేస్తున్నాం) నాగార్జున సినిమాలకు ఇది చాలా కామన్ అట..ఈ మాట నాగార్జునే చెప్తున్నారు..హిట్టైన సినిమాలకు కూడా రీ షూట్ చేసామని సోగ్గాడే చిన్నినాయనా ప్రమోషన్లో చెప్పుకొచ్చారు..అంతే కాదు తన ప్రతి సినిమా షూటింగ్ షెడ్యూల్లోనే ఓ ఐదురోజులు రీషూట్ కి కేటాయిస్తామంటున్నాడు..మనం, మన్మథుడు, మాస్‌, సూపర్‌ సినిమాలకు కూడా రీషూట్‌ చేశారట..ఐతే అవన్నీ హిట్ అవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదంటాడు నాగ్.. సొంతంగా నిర్మించే సినిమాలకు రీషూట్ అంటే ఆ ఖర్చేదో నాగ్ పైనే పడుతుంది కాబట్టి ఎవరికీ అబ్జక్షన్ ఉండదు..కానీ బైటి ప్రొడ్యూసర్లు కోరితే తాను రెడీ అని నాగార్జున చెప్పారు..ఐతే ఇలా రీషూట్ అవసరం లేకుండా..మానిటర్లు వచ్చాయ్..ఆన్ ది స్పాటే..మార్పులు చేసుకోవచ్చు..ఐనా రీషూట్ చేయాల్సి వస్తుందంటే ఆయా దర్శకులకు క్లారిటీ లేకపోవడంతోనే అని అర్ధం అవుతుంది..ఐతే నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాపుల్లో ఒకటి  భాయ్..దానికి కూడా రీషూట్ చేశారట..ఐతే దాన్ని కాపాడటం మాత్రం  ఎవరివల్లా కాదని నాగార్జునకు ముందే తెలిసిందట..అంత భారీ తప్పిదాలు షూటింగ్ దశలో చోటు చేసుకుంటే నాగ్ ఎందుకు పట్టించుకోలేదని ఫ్యాన్స్ పాపం మదనపడుతున్నారు..ఐతే నాగ్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు భాయ్ దర్శకుడు వీరభద్రానికి పాతగాయాన్ని గెలికినట్లైంది..

Tollywood Manmadudu Nagarjuna is very busy in Sogade Chinni Nayana movie post production work. In an interview he revealed that for all his movies he did re shoots. It is common to all his hit movies. He give time 5 days time to re shoot in his schedule.