తెగ మోసేస్తున్న రాజ్ తరుణ్

12 Jan 2016

        ఈ మధ్యే తెలుగు తెరపై మెరుస్తున్న కుర్రహీరో రాజ్ తరుణ్..వరసగా సినిమాలు విడుదల అవుతుండటంతో అందరి దృష్టీ మనోడిపై పడుతోంది..ఐతే సినిమాజనాన్ని మోసేయడంలో మనోడిని మించినవాళ్లు లేరేమో అన్పిస్తుంది..దీనికి సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా ఆడియో ఫంక్షన్ మరోసారి వేదికగా మారిందంటారు.. గోపి సుందర్ అనే మ్యూజీషియన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు..గోపి సుందర్ మళయాళ చిత్రరంగంలో పాపులర్..ఐతే రాజ్ తరుణ్ ఆడియో ఫంక్షన్లో గోపి సుందర్ కు పెద్ద ఫ్యాన్ ని అంటూ ఊదరగొట్టేశాడు..రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందెప్పుడు..మళయాళ సినిమాలు ఎన్ని చూశాడు...వాటిలో గోపి సుందర్ ఎన్నిటికి మ్యూజిక్ ఇచ్చాడో తెలీక ఆడియెన్స్ నవ్వుకున్నారు..రాజ్ తరుణ్ తీరు చూసి కాకా బాకా రాయుళ్లు ఎక్కువే కానీ..మరీ ఇంతలానా అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనం..ఐతే  ఏ నిర్మాతనో..దర్శకుడినో మునగచెట్టు ఎక్కించాడంటే కాస్తో..కూస్తో అర్ధం కానీ..ఇలా మ్యూజిక్ డైరక్టర్ ని కూడా వదలరా ఏంటి అంటూ జోకులేస్తున్నారు

Young hero Raj Tarun getting continuous hits. So total industry is looking at him. In his recent movie Sithamma Andalu Ramayya Sitralu audio function he said i am big fan of malyalam music director Gopi Sundhar. He is praising a lot.