పవన్ కు రెండు కోట్లు ఎగ్గొట్టిన ప్రొడ్యూసర్ ఎవరు?

12 Jan 2016         తెలుగు చిత్రపరిశ్రమలో రెమ్యునరేషన్లు ఎగ్గొట్టారంటూ కంఫ్లైంట్లు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది..ఐతే ఈసారి పవన్ కల్యాణ్ ఆ పని చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది..అత్తారింటికి  దారేది సినిమాకు తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ రెండు కోట్లు బకాయి ఇవ్వలేదని ఆ సినిమా ప్రొడ్యూసర్ బివివిఎస్ ప్రసాద్ పై పవన్ మా లో ఫిర్యాదు చేశాడు..నాన్నకు ప్రేమతో రిలీజ్ టైమ్ లో ఆ అప్పు తీర్చేస్తానని ప్రొడ్యూసర్ హామీ ఇచ్చినట్లు పవన్ కంప్లైంట్..ఐతే ఇప్పుడు ఆ డేట్ వచ్చినా తన బకాయి సంగతి తేల్చకపోవడంతోనే ఇలా చేసినట్లు పవన్ సన్నిహితులు చెప్పుకుంటున్నా..టాప్ హీరో అయి ఉండి కూడా నిర్మాతల బాగోగులు పట్టించుకోకుండా ఇలా ఫిర్యాదు చేయడంపై విమర్శలూ విన్పిస్తున్నాయ్..అందులోనూ పవర్ స్టార్ నిర్మాతల మంచి కోరుకుంటాడు..ఆర్ధికపరమైన సాయం కూడా  చేస్తాడంటూ ఫ్యాన్స్ చెప్తుంటాడు..అలాంటిది ఇప్పుడు పవన్ ఇలా సడన్ గా ఇష్యూ రైజ్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది..ఇదేమైనా బాబాయ్-అబ్బాయ్ వార్ లో భాగంగా జరిగిందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయ్..

Pavan Kalyan gave complaint against producer BVSN Prasad in MAA. He is not giving two crore rupees for Atharintiki Movie remuneration. He told that he will at the time of Nannaku Prematho movie release, its release dates are conformed. So i gave complaint against him.