పవన్ కొత్త సినిమాకు ఫ్లాప్ డైరక్టర్

13 Jan 2016


               పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది వచ్చి మూడేళ్లవుతోంది..ఐతే  ఎప్పటికప్పుడు కొత్త కాంబినేషన్లతో సినిమా వస్తుందని లీకులు రావడం ఆ తర్వాత అవి ఆగిపోవడం చూస్తూనే ఉన్నాం..లేటెస్ట్ బజ్ ఏంటంటే పవన్ తమిళ డైరక్టర్ సూర్యతో మరోసారి జట్టు కట్టబోతున్నాడట..సూర్య గుర్తున్నాడు కదా..2001లో వచ్చిన ఖుషీకి డైరక్షన్ చేసింది సూర్యనే..ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో పులి అనే ఫ్లాప్ సినిమా వచ్చింది..ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుని విడుదలైన తర్వాత డిజాస్టర్ గా మిగిలిన పులి తర్వాత ఎస్ జే సూర్య దర్శకత్వంలో నటించేందుకు ఏ తెలుగు నటుడూ ప్రయత్నించలేదు..ఐతే ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ ఎస్జే సూర్యతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని నేషనల్ మేగజైన్ ఒకటి చెప్తోంది..ఆ కథనం ప్రకారం లైట్ హార్టెడ్ సబ్జెక్ట్ తో కామిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండబోతోందని తెలుస్తోంది..స్టోరీ విషయానికి వస్తే..అన్ని సినిమాలకు చెప్పేటట్లే..ఇది కూడా చాలా కొత్తగా ఉంటుందంటూ హడావుడి జరుగుతోంది.. సర్దార్ గబ్బర్ సింగ్ పూర్తైన తర్వాత పవన్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడంటున్నారు..

Pavan Kalyan is now busy with Sardhar Gabarsing shooting. Now he going to a movie in the direction of Kushi director S.J.Suya, in their combination Pulli was flapped, Now they both are again going to do a movie.